Globetrotter Event Mahesh Babu Speech: మహేష్ బాబు(Superstar Mahesh Babu) అభిమానులు నిన్నటి సాయంత్రాన్ని జీవితం లో మర్చిపోలేరు. మహేష్ తో పాటు ఇండస్ట్రీ లో ఎదిగిన తోటి స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేస్తూ ముందుకు వెళ్తుంటే, మా మహేష్ బాబు ఇంకెంత కాలం గుంటూరు కారం, సర్కారు వారి పాట లాంటి సినిమాలు చేస్తూ ఉంటాడు?, మహేష్ టాలెంట్ కి అందరి పాన్ ఇండియన్ హీరోలకంటే పెద్ద రేంజ్ లో ఉండాలి, కానీ అందరికంటే తక్కువ ఉన్నాడు అని బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇంతకాలం వాళ్ళ ఎదురు చూపులకు రాజమౌళి(SS Rajamouli) తో ‘వారణాసి'(Varanasi Movie) లాంటి అంతర్జాతీయ సినిమా తీస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ మరోసారి గర్వపడేలా చేస్తున్నాడు. ఈ సందర్భంగా నిన్న ఆయన ఈవెంట్ లో ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘చాలా రోజులు అయిపోయింది ఇలా బయటకి వచ్చి. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా కొత్తగా ఉంది, కానీ చాలా బాగుంది. స్టేజి మీదకు సింపుల్ గా అలా నడిచి వస్తాను సార్ అని రాజమౌళి గారితో అన్నాను. కుదరదు అన్నారు. చూసారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో. సరే సార్ సింపుల్ గా నా స్టైల్ లో ఒక బులుగు చొక్కా వేసుకొని వస్తాను అని అన్నాను, కుదరదు అన్నారు, చూసారుగా నా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారో. అదేంటండీ గుండీలు లేవు, ఒక రెండు మూడు బటన్స్ అయినా ఇవ్వండి అన్నాను, కుదరదు అన్నారు, స్టైల్ ఇంతేనమ్మా అన్నారు. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మని అనలేదు. తర్వాత అదే చెయ్యమంటారేమో, ఇదంతా మీకోసమే. మీరంతా ఇంత ఓపిగ్గా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు, అప్డేట్ అప్డేట్ అని అడిగారు కదా, ఎలా ఉంది అప్డేట్?’.
‘మన స్టైల్ లో చెప్పాలంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. నాకు కూడా అలాగే అనిపించింది. నాన్న గారంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే ప్రతీ మాట వినేవాడిని, ఒక్క మాట తప్ప. ఆయనెప్పుడూ నన్ను పౌరాణిక సినిమా చెయ్యమనేవాడు. నువ్వు గెటప్ లో చాలా బాగుంటావు రా అనేవాడు. ఆ మాట ఎందుకో నేను ఎప్పుడూ వినలేదు, ఈరోజు నా మాటలు ఆయన వింటూ ఉండుంటాడు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది నా డ్రీం ప్రాజెక్ట్, ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం లో ఒకసారి చెయ్యగలిగే ప్రాజెక్ట్,దీనికి ఎంత కష్టపడాలో, అంత కష్టపడుతాను. మీ అందరినీ గర్వపడేలా చేస్తాను, ముఖ్యంగా మా డైరెక్టర్ ని గర్వపడేలా చేస్తాను. వారణాసి విడుదలైనప్పుడు మాత్రం ఇండియా మొత్తం మనల్ని చూసి గర్విస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.
