Globe Trotter Song SSMB29: తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన దర్శకుడు రాజమౌళి… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించిన ఏకైక తెలుగు దర్శకుడిగా రాజమౌళి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేసిన బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియా సినిమాల హవా మొదలైంది. ఇక ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా తెరకెక్కుతోంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏది లేకపోవడం విశేషం…1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచ స్థాయి స్టాండర్డ్ లో ఉండటమే కాకుండా ప్రపంచంలోనే ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని రాజమౌళి చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు…
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నింటికంటే కూడా ఈ సినిమా విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్న ‘పృథ్వీ రాజ్ సుకుమారన్’ కు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. దాంతో పాటుగా ఆయన ‘కుంభ’ అనే పాత్ర ను పోషించబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు…
ఇక ఆ పోస్టర్ మీద కొన్ని విమర్శలు వచ్చినప్పటికి రాజమౌళి స్టాండర్డ్ లోనే ఆ పోస్టర్ కూడా చాలా గ్రాండీయర్ గా ఉండడం విశేషం… నిన్న ఈ సినిమా నుంచి ‘ గ్లోబ్ ట్రిట్టేర్’ అంటూ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు ఇదేంటి ఈ సాంగ్ ఇలా ఉంది. 1200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలోని పాట ఇలా ఉంటే సినిమాని ఎవరు చూస్తారు అంటూ చాలామంది ఈ సాంగ్ మీద విమర్శలైతే కురిపిస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈనెల 17వ తేదీన సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్ ని ఇవ్వబోతున్న రాజమౌళి దాని కంటే ముందే విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. అలాగే ఒక సాంగ్ ను కూడా రిలీజ్ చేసి సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈనెల 15వ తేదీన లక్ష మంది అభిమానుల సాక్షిగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను ఇవ్వడానికి రాజమౌళి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికోసమే 25 కోట్లు పెట్టి రామోజీ ఫిలిం సిటీ లో ఒక భారీ సెట్ కూడా వేస్తున్నారు…