Prashant Kishor Comments On Modi: ప్రశాంత్ కిశోర్.. పరిచయం అక్కరలేని పేరు.. మంచి న్యాయవాది.. యాక్టివిస్ట్.. స్ట్రాటజిస్టు.. ఐదేళ్ల క్రితం వరకు పార్టీలకు స్ట్రాటజిస్టుగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్, వైసీపీని పనిచేశారు. అయితే ఈ ప్రశాంత్ కిశోర్ మూడేళ్ల క్రితం జన్‌సురాజ్ పార్టీ పెట్టారు. తన సొంత రాష్ట్రం బిహార్‌లో పాదయాత్ర చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను పోటీ చేయిస్తున్నారు. ఆయన మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఇక పీకేకుప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకి. రాజ్యాంగం అందించిన అభిప్రాయ స్వేచ్ఛ హక్కును సద్వినియోగం చేసుకోవడం ఆయన ధర్మం. అయితే, ఈ వ్యతిరేకత దాటి అబద్ధాలను ఆధారంగా చేసుకుని ప్రచారం చేయడం ఆయన వృత్తి నైతికతకు అంతరాయం కలిగిస్తోంది.
Also Read: 20 ఏళ్ళ యువతి పై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫిర్యాదు..అసలు ఏమైందంటే!
ఇటీవల ఉత్తరాఖండ్‌లో మోదీ పర్యటనపై..
నవంబర్ 9న ప్రధాని మోదీ దేవభూమి ఉత్తరాఖండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వందల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనదిగా మారింది. అయితే, ఈ సానుకూల సంఘటనను రాజకీయంగా దుష్ప్రచారం చేయడానికి పీకే సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకున్నారు.
తప్పుడు సర్క్యులర్ వైరల్..
పీకే తన సోషల్ మీడియా ఖాతాల్లో దేవభూమి ఉత్తరాఖండ్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్‌ను పంచుకున్నారు. దీని ప్రకారం, బీటెక్ విద్యార్థులు మోదీ కార్యక్రమానికి హాజరైతే వారి మార్కుల్లో 50 శాతం ఉచితంగా కలిపేస్తారని పేర్కొన్నారు. దీనిని ‘మోదీ లంచం‘గా చిత్రీకరించి, ఆయన అనుయాయులు కూడా ఈ దస్తావేజును విస్తృతంగా షేర్ చేశారు. ఈ ప్రచారం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందింది. అయితే ఆ సర్క్యులర్‌ను సూక్ష్మంగా గమనిస్తే, ఈ నోటిఫికేషన్‌లో యూనివర్సిటీ అధికారిక లోగో లేకపోవడం, వైస్ ఛాన్సలర్ లేదా రిజిస్ట్రార్ సంతకాలు లేకపోవడం వంటి స్పష్టమైన లోపాలు కనిపిస్తాయి. ఇది స్పష్టంగా మార్ఫింగ్ చేసిన దస్తావేజు అని తేలింది. యూనివర్సిటీ అధికారులు తక్షణమే స్పందించి, అధికారిక లోగో, సంతకాలతో కూడిన మరో ప్రకటన విడుదల చేశారు. ఇది తప్పుడు సమాచారమని, ఇలాంటి దస్తావేజును ప్రముఖ న్యాయవాది పంచుకోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పీఐబీ అధికారిక ఖండన..
పీకే షేర్ చేసిన నోటిఫికేషన్‌ను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా పూర్తిగా ఫేక్‌గా ప్రకటించింది. అధికారిక ప్రకటనలో ఇది తప్పుడు సమాచారమని నిర్ధారించి, ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ ఖండనలు పీకే ప్రచారం ఆధారరహితమని నిరూపించాయి. రాజకీయ లక్ష్యాల కోసం నిజాల త్యాగంపీకే చర్యలు కేవలం మోదీ వ్యతిరేకతకు పరిమితమై, నిజాలను ధృవీకరించకుండా ప్రచారం చేయడం వలన ఆయన ప్రతిష్ఠకు మచ్చగా మారింది. న్యాయవాదిగా ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి బాధ్యతారహిత ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ విమర్శలు స్వాగతమే, కానీ అబద్ధాలు ఆధారంగా చేసుకుంటే అది ప్రజాస్వామ్యానికి హానికరం. ఈ ఘటన పీకే వంటి ప్రముఖులు సోషల్ మీడియాలో సమాచారాన్ని షేర్ చేసేముందు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది.