https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్ కి జంటగా గ్లోబల్ బ్యూటీ… కెజిఎఫ్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్?

కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా అవతరించారు. కెజిఎఫ్ 2 ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Written By:
  • Shiva
  • , Updated On : June 7, 2023 / 06:21 PM IST

    NTR

    Follow us on

    NTR:ఎన్టీఆర్ నుండి రాబోయేవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. సెట్స్ పై ఉన్న దేవర రూ. 300 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. దేవర అనంతరం ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ చిత్రాల్లో నటించాల్సి ఉంది. దేవర 2024 సమ్మర్ కి విడుదల కానుంది. వార్ 2, కెజిఎఫ్ డైరెక్టర్ చిత్రాలు పట్టాలెక్కేది వచ్చే ఏడాదే. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ ఇచ్చారు. 2024 సమ్మర్ లో షూటింగ్ స్టార్ట్ అంటూ అధికారికంగా తెలియజేశారు.

    కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా అవతరించారు. కెజిఎఫ్ 2 ఏకంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వెయ్యి కోట్ల క్లబ్ లో ఆ చిత్రం చేరింది. ఆయన దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ హీరో ఎన్టీఆర్ చేయడమంటే మామూలు విషయం కాదు. అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. ఆ హైప్ ని మరో రేంజ్ కి తీసుకెళ్లే న్యూస్ తాజాగా చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ 31 హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను అనుకుంటున్నారట. ఆమె దాదాపు ఖరారు అయినట్లే అన్న మాట వినిపిస్తోంది.

    మొదట దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్ పేర్లను పరిశీలించిన మేకర్స్ ప్రియాంక చోప్రా అయితే బెటర్ అనుకుంటున్నారట. ఆమె ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో హీరోయిన్ గా చేయడం ఖాయమే అంటున్నారు. ఈ మేరకు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రియాంక చోప్రా రామ్ చరణ్ కి జంటగా జంజీర్ చేసింది. అది బాలీవుడ్ మూవీ అని చెప్పాలి. కాబట్టి ఎన్టీఆర్ తో ప్రియాంక జతకడితే ఫస్ట్ టాలీవుడ్ మూవీ అవుతుంది.

    ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలు, సిరీస్లు మాత్రమే చేస్తున్నారు. ఆమె బాలీవుడ్ కి దూరమయ్యారు. ఇక్కడి రాజకీయాలు తట్టుకోలేకే ముంబైకి దూరమైనట్లు ప్రియాంక చోప్రా చెప్పారు. ఆమె లేటెస్ట్ సిరీస్ సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ హీరో హృతిక్ రోషన్ తో వార్ 2 చేయనున్నారు. వార్ 2 సైతం భారీ బడ్జెట్ మూవీ. ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు కూడాను.