https://oktelugu.com/

Glimpse of Prem Kumar: వధువు కోసం ‘ప్రేమ్ కుమార్’ తిప్పలు

వరుడు రెడీగా ఉన్నాడు. కానీ వధువు ఎవరూ సెట్ కావడం లేదు. చాలా సంబంధాలు చూసినా సెట్ కాని వరుడు మన హీరో సంతోష్ శోభన్ కష్టాలపై తీసిన సినిమానే ‘ప్రేమ్ కుమార్’. తాజాగా ఈ సినిమా నుంచి ‘గ్లింప్స్’ వీడియో రిలీజ్ అయ్యింది. అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివప్రసాద్ పన్నీరు నిర్మించారు. అనంత్ శ్రీకర్ సంగీతం సమకూర్చారు. తాజాగా ‘ప్రేమ్ కుమార్’ సినిమా నుంచి ఒక వీడియో రిలీజ్ అయ్యింది. ఆద్యంతం […]

Written By:
  • NARESH
  • , Updated On : September 1, 2021 / 09:30 AM IST
    Follow us on

    వరుడు రెడీగా ఉన్నాడు. కానీ వధువు ఎవరూ సెట్ కావడం లేదు. చాలా సంబంధాలు చూసినా సెట్ కాని వరుడు మన హీరో సంతోష్ శోభన్ కష్టాలపై తీసిన సినిమానే ‘ప్రేమ్ కుమార్’. తాజాగా ఈ సినిమా నుంచి ‘గ్లింప్స్’ వీడియో రిలీజ్ అయ్యింది. అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివప్రసాద్ పన్నీరు నిర్మించారు. అనంత్ శ్రీకర్ సంగీతం సమకూర్చారు.

    తాజాగా ‘ప్రేమ్ కుమార్’ సినిమా నుంచి ఒక వీడియో రిలీజ్ అయ్యింది. ఆద్యంతం ఆకట్టుకునేలా నవ్వులు పూయించేలా ఈ వీడియో ఉంది. హీరో సంతోష్ పెళ్లి తిప్పలపై ట్రైలర్ సాగింది. ఎన్నో పెళ్లి చూపులు చూసినా వరుడు సంతోష్ కు పెళ్లి సెట్ కాదు. వధువు దొరకదు.. అనే పాయింట్ పై ఈ సినిమా ఆద్యంతం కామెడీ పంచేలా తీర్చిదిద్దారు.

    చివరకు వరుడి బాధ చూడలేక కుటుంబ సభ్యులే ఓ అమ్మాయిని చూస్తారు. ఆమె ఎవరన్నది పెళ్లి పీటలు ఎక్కేదాకా వరుడు సంతోష్ కు తెలియదు.. ఆ తర్వాత పెళ్లికూతురు లేచిపోతుంది.. ఇలా ఉత్కంఠగా సాగేలా ఆసక్తికర కథాంశంతో ఈ ‘ప్రేమ్ కుమార్’ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

    సినిమా ట్రైలర్ మొత్తం కామెడీ, పెళ్లి కష్టాలు.. సంతోష్ పెళ్లి బాధలపై చూపించారు. కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.