Girlfriend Movie Director Controversy: కొన్ని సినిమాలు కమర్షియల్ గా ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఒక ప్రేక్షకుడు రెండున్నర గంటల పాటు తనకున్న బాధలను మర్చిపోవడానికి థియేటర్ కి వస్తాడు. అందులో చాలామంది కమర్షియల్ సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ప్రేక్షకుడు తను చేయలేని పనులను స్క్రీన్ మీద హీరో చేసి చూపిస్తాడు కాబట్టి హీరోలో తనను తాను ఊహించుకొని ఆనందపడుతుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కొన్ని సినిమాలు మాత్రం మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. కొన్ని మూవీస్ మాత్రం మహిళల యొక్క బలాలు ఏంటి? అనే వాటిని గుర్తు చేస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాలు సమాజానికి చాలావరకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కూడా అలాంటిదే కావడం విశేషం… గత వారం రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ టీమ్ రీసెంట్ గా ఒక థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళారు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఈ సినిమా తనకు బాగా నచ్చిందని సినిమాలో దర్శకుడు చూపించిన పెయింట్స్ గురించి మాట్లాడింది. ఈ సినిమా చూసినందుకు తనకు చాలా హ్యాపీగా ఉందని ఇలాంటి సినిమాలు ఇంతకుముందు రాలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక ఫైనల్ గా ఆమె ఇప్పుడు నాకు చాలా దైర్యం గా ఉంది అంటూ తన ఒంటి మీద ఉన్న చున్నీని తీసివేసింది… తన ధైర్యానికి మెచ్చుకున్న దర్శకుడు ఆమెను హాగ్ చేసుకున్నాడు. ఇక ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది… ‘ఉమెన్ ఎం పవర్ మెంట్’ అంటే ఒంటి మీద ఉన్న చున్నీ ని తీసివేసి మేము ధైర్యంగా ఉన్నాము అని చెప్పడం కాదంటూ కొంతమంది ఈ విషయం మీద నెగెటివ్ గా స్పందిస్తున్నారు. నిజానికి చున్ని తీసివేయడం అనేది ఉమెన్ ఎం పవర్ మెంట్ లో భాగం కాదు.
మహిళలు స్ట్రాంగ్ గా ఉండాలి, వాళ్ళు ఎవరికంటే తక్కువ కాదు, వాళ్ళ ఆలోచన ధోరణి మారాలి అనేది ఉమెన్ ఎం పవర్ మెంట్ యొక్క మీనింగ్…అమ్మాయిలు ఒంటి మీద చున్నీ వేసుకునేది ఎందుకు అంటే కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ఇతరులకు కనిపించకూడదనే ఉద్దేశ్యంతో చున్నీ వేసుకుంటారు.
అంతే తప్ప వాటిని తీసినంత మాత్రాన మనం ధైర్యంగా మారాము అనుకోవడం మన మూర్ఖత్వం అవుతోంది. చున్నీ తీస్తే మన ఆలోచనలు స్ట్రాంగ్ గా ఉన్నట్లా? అది కాకపోను మనం అలా చేయడం వల్ల ఎదుటివారికి అది అడ్వాంటేజ్ గా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఈమె చున్ని తీయడానికి దర్శకుడు సమర్ధించడంతో ఈ మొత్తం వ్యవహారం కొత్త వివాదానికి దారి తీసింది…
ఇక ఆమె సినిమా చూసి తన ఒంటి మీద నుంచి చున్నీ తీసేసినట్టుగానే మిగతా వాళ్ళను కూడా చున్నీ తీసేయమంటావా అంటూ దర్శకుడు మీద చాలామంది చాలా విమర్శలైతే చేస్తున్నారు. ఇక ఇక్కడితో ఆగకుండా ఆ అమ్మాయి చున్నీ తీసేయడం రాహుల్ ఆమెని హగ్ చేసుకోవడం ఇదంతా ప్రమోషనల్ గా వాడుకుంటూ గీతా ఆర్ట్స్ అఫిషియల్ ఐడి నుంచి ఈ వీడియోను షేర్ చేశారు… ప్రస్తుతం ఈ వివాదం భారీ స్థాయిలో చెలరేగుతోంది. ఇక దీని మీద దర్శకుడు స్పందిస్తే బాగుంటుందని మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…