Homeఎంటర్టైన్మెంట్Ghattamaneni Sitara: తాత కృష్ణను తలుచుకొని ఆ రోజు ఫోటో షేర్ చేసి సితార ఎమోషనల్.....

Ghattamaneni Sitara: తాత కృష్ణను తలుచుకొని ఆ రోజు ఫోటో షేర్ చేసి సితార ఎమోషనల్.. వైరల్ ఫోటో

Ghattamaneni Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి పరిచయం అక్కర్లేదు. చిన్నతనం నుంచే తండ్రికి తగ్గ అనే పేరును సంపాదించింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. తన డాన్స్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది ఈ చిన్నారి. సేవా గుణంలో ఘట్టమనేని వారసురాలు అనిపించుకుంది. అయితే రీసెంట్ గా ఈమె చేసిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నేషనల్ సినిమా డే సందర్భంగా తన కుటుంబంతో ఉన్న ఫోటోను షేర్ చేసింది సితార. ఇది పాత ఫోటో అయినప్పటికీ ఇందులో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉన్నారు. సినిమా – నా జీవితంలో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది నాకు పరిశ్రమ కాదు.. ఇది నా DNA లో ఒక భాగం. సిల్వర్ స్క్రీన్ టైటాన్ అయిన మా నాన్న నాకు ఇన్స్పిరేషన్. ఆయనకు తన తండ్రి స్ఫూర్తి. లెజెండరీ ఎవర్‌ గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణగా ఈ ప్రపంచానికి తెలిసిన మా తాతగారు మనందరిపై ఎంతగానో ప్రభావం చూపారు. మా నాన్న, నా అన్న కోసం ఆయన విడిచిపెట్టిన ఈ లెగసీలో భాగమైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి కృతజ్ఞతతో ఉన్నాను. ఇది సినిమా మాయాజాలానికి, నా ఫ్యామిలీ సినిమాటిక్ జర్నీని ఇష్టపడి మద్దతుగా నిలిచే మీ అందరికీ National Cinema Day శుభాకాంక్షలు అంటూ తెలిపింది సితార.

అయితే సితార పంచుకున్న ఈ ఫోటోలో దివంగత నటుడు కృష్ణ, నమ్రత-మహేష్ లు ఉన్నారు. తల్లిదండ్రి మధ్య కూర్చొని ఉన్న సితార ఈ పిక్ ను షేర్ చేసుకుంది. అందులో తన సోదరుడు గౌతమ్ కృష్ణ కూడా ఉన్నాడు. అంటే మూడు తరాలను ఇక్కడ మనం చూడవచ్చు. దీన్ని బట్టి సూపర్ స్టార్ లెగసీని మహేష్ బాబు ఏ విధంగా కాపాడుతున్నాడో.. పిల్లలను ఎంత పద్దతిగా పెంచుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే వంశీ సినిమాలో మహేష్-నమ్రతలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య స్నేహం ఆ తర్వాత ప్రేమ మొదలైంది. మొత్తానికి 2005 ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నారు ఈ ప్రేమ జంట.

మహేష్ నటించిన 1 నేనొక్కడినే సినిమా ద్వారానే గౌతమ్ సిని ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రిన్స్ సితార కూడా సినిమాల్లో నటించాలని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికే ఆమె ఓ జ్యూయలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. అలా వచ్చిన డబ్బును కూడా పేద వారి కోసం ఖర్చు చేసి తండ్రికి తగ్గ తనయ అనే పేరు సంపాదించింది సితార. మంచి మనుసు, గొప్ప డాన్సర్ గా నిలుస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించిన ఈ చిన్నారి సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by sitara (@sitaraghattamaneni)

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular