Anasuya Bharadwaj: అనసూయ సోషల్ మీడియా ఫ్రీక్. ఎవరెన్ని విమర్శలు చేసినా దాన్ని వదిలిపెట్టరు. తరచుగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటారు. తాజాగా ఆమె ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో ఆమె నటించిన చిత్రాల ప్రస్తావన వచ్చింది. ప్రేమ విమానం మూవీలో అనసూయ కీలక రోల్ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదలైంది. పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ప్రేమ విమానం మూవీలో అనసూయ తెలంగాణ మాండలికం మాట్లాడారు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ నెటిజన్… ప్రేమ విమానం మూవీలో మీ పెర్ఫార్మన్స్ అద్భుతం. తెలంగాణా మాండలికం ఓన్ చేసుకొని చక్కగా డైలాగ్స్ చెప్పారని ప్రశంసలు కురిపించాడు. దానికి కృతఙ్ఞతలు తెలిపిన అనసూయ… నేను ఇక్కడదాన్నే కదా, అందుకే ఓన్ చేసుకున్నాను, అని రిప్లై ఇచ్చింది. అనసూయ సమాధానానికి మరొక నెటిజెన్ కౌంటర్ వేశాడు. మీది తుని అంట కదా? అని అడిగారు.
ఈ ప్రశ్నకు స్పందించిన అనసూయ… అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకోని నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది హైదరాబాద్ లోనే అని సమాధానం ఇచ్చింది. అనసూయ రిప్లై వైరల్ గా మారింది. అనసూయ తాను తెలంగాణ అమ్మాయిని అని చెప్పుకునే ప్రయత్నం చేసింది ఇక్కడ. అనసూయ సాధారణంగా ఆంధ్రా మాండలికం మాట్లాడుతుంది. ఆమె పుట్టి పెరిగింది హైదరాబాద్ అయినా కుటుంబ మూలాలు ఆంధ్రాలో ఉన్నాయని ఓ వాదన.
అనసూయ హైదరాబాద్ లో ఎంబీఏ చదివింది. ఓ కంపెనీలో హెచ్ ఆర్ గా చేసింది. అనంతరం సాక్షి టీవీలో న్యూస్ యాంకర్ గా మారింది. జబర్దస్త్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. 2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలైంది. అనసూయ ఈ షో ద్వారా గ్లామర్ యాంగిల్ పరిచయం చేసింది. పొట్టిబట్టల యాంకర్ గా ఆమె అనతికాలంలో ఫేమస్ అయ్యింది. స్టార్ యాంకర్ గా ఎదిగిన అనసూయ నటిగా మారి మరింత సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు.
Anevaallu ennaina antarandi.. kaani nijam anedi okkate untundi kada ..
Nenu Hyderabad lone puttanu periganu chaduvukunnanu.. https://t.co/4J88REJFfJ— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 14, 2023