Ghaati USA Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు డిఫరెంట్ కథలతో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ఇలాంటి క్రమంలోనే క్రిష్ సైతం మంచి సినిమాలను చేయడానికి తీవ్రమైన అయితే చేస్తున్నాడు… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన అనుష్క తో చేసిన ‘ఘాటి’ మూవీ ఇండియాలో రేపు రిలీజ్ అవుతున్నప్పటికి ఇప్పటికే యూఎస్ఏ లో ప్రీమియర్ షో లు అయితే వేశారు. మరి ఆ షో లను చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద ఎలాంటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: అక్కడ ‘ఓజీ’ రిలీజ్ లేనట్టే..పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త!
కథ
ఒక అడవి ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది జనాలు గాంజాయిని అమ్ముతూ వాళ్ల జీవన శైలిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే కొంతమంది వాళ్ళ మీద దాడి చేస్తారు. తద్వారా పోలీసులకు దొరకకుండా వాళ్లు గంజాయి ని సప్లై చేస్తూ ఉంటారు. మరి దాని వల్ల కొంతమందికి జరగరాని అనర్ధాలు అయితే జరుగుతాయి. ఇక అప్పుడు రియలైజ్ అయిన వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు. తద్వారా వాళ్ల కెరియర్లు ఎలా సాగయి అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే అంటూ యుఎస్ లో ఈ మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతుండటం విశేషం…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాను దర్శకుడు క్రిష్ మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ తీసుకెళ్లడనినే చెబుతున్నారు. నిజానికి క్రిష్ లాంటి ఒక సీనియర్ డైరెక్టర్ ఈ జనరేషన్ లో ఉన్న యంగ్ డైరెక్టర్లతో పోటీ పడుతూ మంచి సినిమాలను చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా ఎమోషనల్ సన్నివేశాలకు పెద్దపీట వేసినట్టుగా తెలుస్తోంది. ప్రతి సీన్ లో ఏదో ఒక డిటెలింగ్ అయితే ఉందట. మరి ఇలాంటి సందర్భంలోనే క్రిష్ చేస్తున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే అనుష్కను ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
ఈ సినిమాకి ఏపాటి ఎమోషన్ కావాలో దాని చాలా చక్కగా మెటీరియలైజ్ చేసి మరి క్రిష్ ఈ సినిమాలో పెట్టినట్టుగా యూఎస్ఏ లో ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు తెలియజేస్తున్నాడు… ఇక మ్యూజిక్ మాత్రం కొంతవరకు డల్ అయిందని, అది ఇంకో ఇంకాస్త బాగుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయేదని చెబుతున్నారు. ఇక విజువల్స్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే అనుష్క ఇప్పటివరకు చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించిందట. తద్వారా ఆమె చేసిన ప్రతి సీను కూడా ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కట్టిపడేస్తుందని గంజాయి సప్లై చేసే సన్నివేశాల్లో అయితే ఆమె ఒక ఇంటలిజెంట్ ని ఉపయోగించిన తీరు అద్భుతంగా ఉందని కూడా తెలియజేస్తున్నారు… వెంకట్ ప్రభుక్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేకపోయిన ఉన్నంతలో ఆయన తన నటనతో మెప్పించాడని చెబుతున్నారు… మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారట…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అంత పెద్దగా హైలైట్ అవ్వలేదు. తద్వారా ఎమోషనల్ సీన్స్ లో కొంతవరకు డెప్త్ అయితే తగ్గినట్టుగా అనిపించింది…ఇక సముద్రంలో నుంచి గంజాయిని సప్లై చేస్తున్న సన్నివేశాల్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికి సినిమా మొత్తం ఆ విజువల్స్ ని మెయింటైన్ చేయలేకపోయారట… ఇక ఎడిటింగ్ చాలా బాగా కుదిరినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్ లో ఉండడం విశేషం…