OG Thaman: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే కథ బాగుండాలి దర్శకుడు ఆ సినిమాని చాలా చక్కగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది.. ఇక దీంతోపాటుగా ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవ్వాలంటే మ్యూజిక్ చాలా వరకు ఇంపార్టెన్స్ వహిస్తూ ఉంటుంది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా వరకు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకొని మరి సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే కొట్టించుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే తమన్ గత కొన్ని రోజుల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా తన ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. దాంతో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు అనిరుధ్ ను తీసుకుంటున్నారు. దీనివల్ల తమన్ పేరు పెద్దగా వినిపించడం లేదు. మరి ఇప్పుడు చేస్తున్న ఓజీ సినిమాకి తను మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయన టాప్ లెవెల్ కి వెళ్ళబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా మంచి వచ్చిన గ్లింప్స్ లోనే అద్భుతమైన మ్యూజిక్ ని అయితే అందించాడు. మరి అలాంటి తమన్ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
Also Read: అక్కడ ‘ఓజీ’ రిలీజ్ లేనట్టే..పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త!
ఇక ఈ సినిమా మొత్తంలో మ్యూజిక్ అయితే హైలైట్ గా ఉంటుందట. దానికోసం ఆయన చాలా వరకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ మంచి మ్యూజిక్ ని అందించడానికి హార్నిశలు కష్టపడ్డాడు. ఇక దానికి తగ్గట్టుగానే బిజిఎం విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
ఇక ఈ సినిమాతో తను అనిరుధ్ తో పోటీపడే రేంజ్ కి వెళ్తాడా? ఈ సినిమా సక్సెస్ లో తను కీలకపాత్ర వహించబోతున్నాడా అనేది తెలియాలంటే మాత్రం ఈనెల 25వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటివరకు తమన్ ఇస్తున్న ఇంటర్వ్యూల్లో తన కెరియర్ లో చేసిన అన్ని సినిమాలు ఒకెత్తయితే, ఓజీ మూవీ మరొక ఎత్తుగా మారబోతోంది అంటూ సినిమా మీద హైప్ ను పెంచుతున్నాడు.
అలాగే తన మ్యూజికల్ కెరియర్ లో కూడా అదొక మెయిల్ రాయి గా మిగిలిపోతోంది అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల్లో కూడా ఆనందాన్ని కలిగింపజేస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఓజీ సినిమా పాన్ ఇండియాలో ఎంతటి వసూళ్లను రాబడుతుందా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…