Geeta Singh Daughter: కొంతమంది నటీనటులను చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అలా ఎప్పటికీ మర్చిపోలేనంతగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటి గీతా సింగ్(Geetha Singh). ‘కితకితలు’ చిత్రం ద్వారా ఈమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. అప్పట్లో ఈ సినిమా ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బక్క పల్చని శరీరం ఉన్న అల్లరి నరేష్, ఇంతటి లావు ఉన్న అమ్మాయి ని ఈ సినిమా లో పెళ్లి చేసుకోవడం, తద్వారా జరిగే సంఘటనల కారణంగా పుట్టిన కామెడీ అప్పట్లో ఆడియన్స్ కి నిజంగానే కితకితలు పెట్టింది. ఈ సినిమా తర్వాత గీతా సింగ్ అనేక సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించింది. కానీ ఈమధ్య కాలం లో ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయితే చాలా కాలం తర్వాత ఆమె ఇటీవలే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
Also Read: అక్కడ ‘ఓజీ’ రిలీజ్ లేనట్టే..పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త!
ఈ ఇంటర్వ్యూ లో ఆమె తన జీవితం లో చోటు చేసుకున్న ఎన్నో సంఘటనల గురించి చెప్పుకొని బాగా ఎమోషనల్ అయ్యింది. ముఖ్యంగా తానూ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన అన్నయ్య కొడుకు చనిపోవడం గురించి ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు మా అన్నయ్య కొడుకు అంటే చాలా ఇష్టం. వాడిని నేను నా సొంత కొడుకు లాగానే పెంచుకున్నాను. కానీ దురదృష్టం కొద్దీ వాడు ఇప్పుడు ఈ లోకం లో లేడు. రెండేళ్ల క్రితం ఆ అబ్బాయి ఢిల్లీ కి టూర్ కోసం వెళ్ళాడు. అక్కడ బైక్ డ్రైవింగ్ చేస్తూ ఒక డివైడర్ కి గుద్దుకొని చనిపోయాడు. ఈ ఘటన కారణంగా నేను మానసికంగా పూర్తిగా కృంగిపోయాను. దేవుడి మీద కోపం వచ్చింది. నన్ను పైకి తీసుకెళ్లి నా కొడుకుని బ్రతికించి ఉన్నా చాలా సొంతోషించేదానిని’ అంటూ ఆమె ఆ ఇంటర్వ్యూ లో ఎమోషనల్ అయ్యింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ నా కుమారుడికి మంచు విష్ణు తన విద్యానికేతన్ లో ఒక ఫ్రీ సీట్ ని ఉంచిపెట్టారు. వాడు పదవ తరగతి పూర్తి చేసుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న విష్ణు గారు స్వయంగా నాకు ఫోన్ చేసి, నా కుమారుడిని వచ్చేయమని అడిగాడు. అలా ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా కుమారుడికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించాడు. చదువు పూర్తి అయ్యాక 2022 వ సంవత్సరం డిసెంబర్ లో వాడికి మంచి MNC కంపెనీ లో ఉద్యోగం కూడా వచింది. 2023 లో యాక్సిడెంట్ లో చనిపోయాడు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే గీతా సింగ్ కి ఒక కుమార్తె కూడా ఉంది. ఈమె తన కూతురుతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లో ఎన్నో ఫన్నీ రీల్స్ కూడా చేసింది. అందులో ఒక రీల్ ని మీరు క్రింద చూడవచ్చు.
View this post on Instagram