Anchor Lasya: యాంకర్ లాస్య లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె బంధువులు, స్నేహితుల మీదే కత్తి దూసింది. ఏకంగా చెంప పగులుద్ది అంటూ… సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. లాస్య బుల్లితెర ప్రేక్షకులను పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా ఈమె పలు బుల్లితెర కార్యక్రమాల్లో కనిపించారు. ఇక మంచి ఫార్మ్ లో ఉండగా వ్యక్తిగత కారణాలతో గ్యాప్ తీసుకున్నారు. అప్పట్లో యాంకర్ రవి-లాస్య ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. తర్వాత వీరి మధ్య విబేధాలు తలెత్తాయని కథనాలు కూడా వెలువడ్డాయి.

కొన్నాళ్ళు కనుమరుగైన లాస్య బిగ్ బాస్ సీజన్ 4 లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ షో ద్వారా ఆమె మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పది వారాలకు పైన లాస్య జర్నీ కొనసాగింది. అయితే ఆమె గేమ్ పట్ల ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫేక్ స్మైల్, సేఫ్ గేమ్ ఆడుతుందంటూ విమర్శలు గుప్పించారు. దీనితో టైటిల్ కొడుతుందనుకున్న లాస్య కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.
Also Read: Ram Charan-Kamal Haasan: రామ్ చరణ్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఇక లాస్య వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే… ఆమె పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో తండ్రి ఆమెను దూరం పెట్టారు. చాలా కాలం లాస్య పేరెంట్స్ లో సంబంధం లేకుండా జీవించారు. లాస్యకు కొడుకు పుట్టాక తల్లిదండ్రులు ఆవేశం వదిలి, చేరదీశారు. ఈ విషయాన్ని లాస్య బిగ్ బాస్ హౌస్ లో స్వయంగా చెప్పింది. లాస్య కొడుకు పేరు జున్ను కాగా వాడికి నాలుగేళ్ళ వయసు ఉంటుంది.

ఈ క్రమంలో లాస్యను బంధువులు, సన్నిహితులు, స్నేహితులు సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అడుగుతున్నారట. ఇంకో బిడ్డను కనొచ్చుగా అంటున్నారట. దీంతో మండిపడ్డ లాస్య అందరికీ ఒక వీడియోతో సమాధానం చెప్పింది. మళ్ళీ తల్లి ఎప్పుడు అవుతావంటూ అడిగితే చెంప పగల కొడతా అని అర్థం వచ్చేలా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇంకెప్పుడూ నన్ను అలా అడగవద్దు, నాకు జున్ను చాలు అని పరోక్షంగా లాస్య తెలియజేశారు. లాస్య ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఎప్పుడూ కామ్ గా ఉండే లాస్య ఇంత సీరియస్ అయ్యారంటే, కారణం పెద్దదే అయ్యుంటుందని ఫ్యాన్స్ వాపోతున్నారు.
Also Read:Prabhas- Lokesh Kanagaraj: విక్రమ్ హిట్ తో ప్రభాస్ థింకింగ్ మారిపోలా?
View this post on Instagram
[…] […]