Homeఎంటర్టైన్మెంట్Star Actor: హత్యకు గురైన స్టార్ నటుడు.. ఇంతకీ ఎవరు చంపారు?

Star Actor: హత్యకు గురైన స్టార్ నటుడు.. ఇంతకీ ఎవరు చంపారు?

Star Actor: ‘జనరల్ హాస్పిటల్’(General Hospital) సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు ‘జానీ వాక్టర్’(Johnny Wactor) శనివారం (మే 25) ఉదయం లాస్ ఏంజలీస్ లో(Los Angeles) దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో వెస్ట్ పికో బౌలేవార్డ్, సౌత్ హోప్ స్ట్రీట్ వద్ద 37 ఏళ్ల ఆయన తన సహోద్యోగితో కలిసి వెళ్తుండగా డౌన్ టౌన్ ఎల్ఏలో తన కారు నుంచి క్యాటలిటిక్ కన్వర్టర్ ను దొంగలించేందుకు ముగ్గురు ముసుగు దొంగలు ప్రయత్నించడంను జానీ వాక్టర్, అతని సహోద్యోగి చూశారు.

‘అయితే నటుడు దొంగల వద్దకు వెళ్లాడని, గొడవ పడకపోయినా అనుమానితుల్లో ఒకరు కాల్పులు జరిపారని, ఆ తర్వాత నిందితులు వాహనంలో పారిపోయారని’ వాక్టర్ తల్లి, పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన జానీ వాక్టర్ ను సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను వాక్టర్ తల్లి స్కార్లెట్ వివరించారు.

‘సమీపంలోని ఇద్దరు నిందితులు చోరీకి పాల్పడుతుండగా నా కొడుకు వాక్టర్ వారిని గమనించాడు వారి వద్దకు వెళ్లి వారించాడు. వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఉన్నారు అక్కడి నుంచి అతను ముగ్గురు సహోద్యోగులతో కలిసి వీధిలో ఉన్న తన కారు వద్దకు నడిచాడు. అందులో ఇద్దరు సహోద్యోగులు తమ వాహనాల వద్దకు వెళ్లేందుకు వేరే దిక్కుల్లో వెళ్లారు, వాక్టర్, ఒక సహోద్యోగి ఒంటరిగా ఉండిపోయారు. పార్క్ చేసిన తన కారు వద్దకు చేరుకోగానే, ముసుగు ధరించిన ఓ వ్యక్తితో తన కుమారుడు మాట్లాడేందుకు ప్రయత్నించాడని.. వారి వద్దకు రాగానే నిందితుడు ఎదురు చూస్తున్న వాహనంలో పారిపోయే ముందు కాల్పులు జరిపాడని చెప్పింది.

‘జనరల్ హాస్పిటల్’ సినిమాలో బ్రాండో కోర్బిన్ పాత్రను పోషించడం ద్వారా మిస్టర్ వాక్టర్ గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘జనరల్ హాస్పిటల్’ బృందం ఎక్స్ (ట్విటర్)లో ఒక ప్రకటనను విడుదల చేసింది, ‘జానీ వాక్టర్ అకాల మరణం గురించి విన్నప్పుడు తాము హృదయ విదారకంగా ఉన్నాము.’ అని పేర్కొంది. ప్రతిరోజూ ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము అన్నారు.

వాక్టర్ ఎన్‌సీఐఎస్, స్టేషన్ 19, వెస్ట్వరల్డ్, కాల్ ఆఫ్ డ్యూటీ: వాన్కార్ సహా వివిధ సినిమాలు, టీవీ సిరీస్ లలో కూడా నటించాడు.

Kalki Movie: కల్కి సినిమా ముందు ఉన్న టార్గెట్స్ ఇవే…

Mahesh Babu : మహేష్ బాబుకు అలా చేస్తే అసలు నచ్చదట… సితార బయటపెట్టిన టాప్ సీక్రెట్!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular