Homeఆంధ్రప్రదేశ్‌NTR And Daggupati Venkateswara Prasad: Jr NTR తో టిడిపి ఎమ్మెల్యేకు వివాదాలు...

NTR And Daggupati Venkateswara Prasad: Jr NTR తో టిడిపి ఎమ్మెల్యేకు వివాదాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు బూతులు తిట్టారు? సంచలన ఆడియో!

NTR And Daggupati Venkateswara Prasad: ప్రముఖ తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టిడిపి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బూతులు తిట్టినట్టు ఒక ఆడియో ఉదయం నుంచి వైరల్ అవుతున్నది.. జూనియర్ ఎన్టీఆర్ పై వెంకటేశ్వర ప్రసాద్ అనుచితంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో, సినీ వర్గాల్లో సంచలనం కలిగించాయి. వెంకటేశ్వర ప్రసాద్ ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరైనా ఉన్నారా అనే చర్చ కూడా మొదలైంది. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కు, వెంకటేశ్వర ప్రసాద్ కు ఎటువంటి వివాదాలు లేవు. అయినప్పటికీ ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు ఎలా చేశారంటూ అభిమానులు మండిపడుతున్నారు.

Also Read: పులివెందుల్లో ఓటమి అంచుల్లో వైఎస్.. చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత ఏమైందంటే?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో ప్రకారం.. వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యమైన పదజాలం ఉపయోగించారు. ఆయన సినిమాలను ఆడ నిచ్చేది లేదని హెచ్చరించారు. బాబు కుమారుడికి హరికృష్ణ కుమారుడు వ్యతిరేకంగా ఉన్నారని.. అందువల్లే ఆయన చిత్రాలను బహిష్కరించాల్సి ఉంటుందని వెంకటేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు వార్ 2 సినిమా ప్రదర్శనను అనంతపురంలో నిలిపివేస్తామని హెచ్చరించారు.. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. వీటిని ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అనంతపురం కు చెందిన ధనుంజయ నాయుడుతో మాట్లాడుతూ వెంకటేశ్వర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. సినిమా ప్రదర్శనకు ధనుంజయ నాయుడు వెంకటేశ్వర ప్రసాద్ ను ఆహ్వానించినప్పటికీ ఆయన రాలేదు. పైగా మరిత ఆగ్రహంతో జూనియర్ ఎన్టీఆర్ పై దూషణలు చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే మాట్లాడిన ఈ ఆడియో సంభాషణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వర ప్రసాద్ బూతులు మాట్లాడటం.. దారుణంగా దూషించడం.. అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం ఆడియోలో రికార్డు అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంచలనం సృష్టిస్తోంది.

వెంకటేశ్వర ప్రసాద్ తన అభిమాన కథానాయకుడి మీద అడ్డగోలుగా మాటలు మాట్లాడిన నేపథ్యంలో జూనియర్ అభిమానులు ఆందోళనకు దిగారు. వెంకటేశ్వర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర ప్రసాద్ నివాసం ఎదుట ఆందోళన చేయడంతో.. పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఈ వివాదంపై స్పందించారు. తాను జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేయలేదని.. తనకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని.. జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా వల్లమాలిన అభిమానమని.. అంతేతప్ప తనకు ఎటువంటి ఉద్దేశాలు లేవని వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యానించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular