Gayapadina Simham First Review: సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో డ్రై పీరియడ్ ఏ స్థాయిలో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి, అవి డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూనే ఉన్నాయి. పర్వాలేదు అని అనిపించే రేంజ్ కంటెంట్ సినిమాలు కూడా ఆడడం లేదు. ఇలాంటి పరిస్థితులు గతంలో చాలానే వచ్చాయి. పైగా ‘రాజా సాబ్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి భారీ సినిమాలు డిజాస్టర్ అవ్వడం వల్ల బయ్యర్స్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉన్నారు. అందరి ఆశలు ఇప్పుడు ‘పెద్ది’ చిత్రం మీదనే ఉన్నాయి. అయితే ఈ గ్యాప్ లో కొన్ని చిన్న సినిమాలపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘గాయపడిన సింహం’. తరుణ్ భాస్కర్ హీరో గా నటించిన ఈ సినిమా, రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షోని నిన్న కొంతమంది మీడియా ప్రముఖులు, సినీ సెలబ్రిటీలకు చూపించారు. వాళ్ళ నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని యూత్ ఆడియన్స్ థియేటర్స్ లో ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేసేలా తీర్చి దిద్దాడట డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్. అమెరికా లో స్థిరపడిన ఒక NRI కుర్రాడు , అక్కడి ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పెట్టిన సరికొత్త నిబంధనలు కారణంగా ఎలాంటి ఇబ్బందులను ఎదురుకున్నాడు అనే ప్లాట్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కించాడట. హీరోగా తరుణ్ భాస్కర్ అద్భుతంగా నటించాడని , ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు. అంతే కాకుండా, సీనియర్ హీరో జేడీ చక్రవర్తి కూడా చాలా కాలం తర్వాత వెండితెర మీద మెరిసినప్పటికీ, బలమైన సాలిడ్ రోల్ తో మన ముందుకొచ్చాడని అంటున్నారు.
ఆయన క్యారెక్టర్ సినిమాలో ఒక మేజర్ హైలైట్ గా నిలుస్తుంది అట. అదే విధంగా శ్రీ విష్ణు స్పెషల్ క్యామియో రోల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అట. అక్కడకక్కడ కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపిస్తాయట కానీ , ఓవరాల్ గా మంచి టైం పాస్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ముఖ్యంగా సలార్ , కేజీఎఫ్ సన్నివేశాల స్పూఫ్ బాగా పేలింది అట. ఈమధ్య కాలంలో ఇలాంటి స్పూఫ్ సన్నివేశాలు సినిమాల్లో చూసి చాలా కాలం అయ్యింది. అప్పట్లో అల్లరి నరేష్ ఇలాంటి సన్నివేశాలు ఎక్కువ గా చేసేవాడు. కానీ ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో అలాంటివి అంతరించిపోయాయి. ఈ సినిమాలో మాత్రం స్పూఫ్ సన్నివేశాలు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా చేశారట, ఇవే సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్తయని అంటున్నారు.