Mahesh Babu Son Gautam: మహేష్ కొడుకు గౌతమ్ టీనేజ్ లోకి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం గౌతమ్ వయసు 16 సంవత్సరాలు. మరి పెద్దోళ్ళు అయ్యే కొద్ది పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. తమకు ఇష్టం వచ్చిన పనులు చేస్తారు. నచ్చిన ప్రదేశాలకు చెక్కేస్తారు. గౌతమ్ కూడా వ్యక్తిగతంగా, స్వాతంత్య్రంగా ఆలోచిస్తున్నాడు. అతడు మొదటిసారి పేరెంట్స్ లేకుండా అడుగు బయటపెట్టాడు. ఫ్రెండ్స్ లో కలిసి వరల్డ్ టూర్ ప్లాన్ చేశాడు. తన క్లాస్ మేట్స్ అందరూ వరల్డ్ కల్చరల్ టూర్ కి వెళుతున్నారు. ఈ విషయం మహేష్ వైఫ్ నమ్రతను తీవ్ర వేదనకు గురి చేసింది.

ఇల్లు వదిలి విదేశాలకు వెళుతున్న గౌతమ్ ని ఉద్దేశిస్తూ ఆమె హార్ట్ బ్రేకింగ్ కామెంట్స్ చేశారు. ‘గౌతమ్ మొదటిసారి మేము తోడు లేకుండా ఒక ట్రిప్ కి వెళుతున్నాడు. అతడు ఇంటి నుండి కాలు బయట పెట్టడం తలచుకుంటే నాలోని సగం నన్ను వీడి వెళ్ళిపోయిన భావన కలిగింది. నేను ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. గౌతమ్ కి రెక్కలొచ్చి గూడు నుండి ఎగిరిపోయాడు. తాను తిరిగి నా కళ్ళ ముందుకు వచ్చే వరకు బాధ పోదు. గౌతమ్ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఈ ట్రిప్ గౌతమ్ కి సరికొత్త అనుభవాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని నమ్రత ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు.
గౌతమ్ ఇంట్లో లేకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నట్లు నమ్రత చెప్పారు. గౌతమ్ పై నమ్రతకు ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఈ కామెంట్స్ నిదర్శనం. లోకంలో ఏ తల్లిదండ్రులు ప్రేమించినంతగా మహేష్-నమ్రత తమ పిల్లలను ప్రేమిస్తారు. ప్రపంచం వారి ముందుకు తీసుకొస్తారు. అడిగింది లేదనకుండా సమకూరుస్తారు. చిన్న వయసులోనే గౌతమ్, సితార చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. సితార పదేళ్లకే సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమెకు సామాజిక విషయాల పట్ల కూడా అవగాహన ఉంది.

ప్రతి ఏటా ఆరేడు సార్లు వరల్డ్ టూర్స్ కి వెళతారు. లోకంలో ఉన్న ప్రతి అందమైన ప్రదేశాన్ని, నగరాన్ని సందర్శిస్తారు. సినిమా తర్వాత మహేష్ కి పిల్లలే ప్రపంచం. ఆయనకు పెద్దగా మిత్రులు కూడా లేరు. షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉండి పిల్లలతో ఆడుకుంటారు. కుటుంబాన్ని అంతగా ప్రేమించే స్టార్ హీరో మరొకరు ఉండరేమో అని మహేష్ ని చూస్తే అనిపిస్తుంది. ప్రస్తుతం మహేష్ ఎస్ఎస్ఎంబి 28 షూట్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది.