Nayani Pavani: బిగ్ బాస్ బ్యూటీ నయని పావని కి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. నయని రీసెంట్ గా గౌతమ్ కృష్ణ తో చేసిన తెలియదే సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది. అదే సమయంలో కొందరు నెటిజన్స్ నయని పై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ తో బిగ్ బాస్ లోకి వెళ్లిన నయని హౌస్ లో ఉంది ఒక వారమే అయినా మంచి పాపులారిటీ దక్కించుకుంది. పాజిటివ్ ఇమేజ్ తో బయటికి వచ్చింది. స్పై బ్యాచ్ తో బాగా క్లోజ్ గా ఉండేది. యావర్ తో ఫ్రెండ్ షిప్ చేసింది.
బిగ్ బాస్ ముగిసిన తర్వాత కూడా శివాజీ, ప్రశాంత్, యావర్ లతో కలిసి గెట్ టు గెదర్ లకు నయని హాజరైంది. యావర్ తో కొంచెం ఎక్కువ సన్నిహితంగా ఉంటుంది. యావర్, నయని పావని కొన్ని రీల్స్ చేశారు. ఆ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్యూట్ పెయిర్ .. జంట చాలా బాగుంది అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేశారు. అయితే తాజాగా నయని, గౌతమ్ లు తెలియదే అనే సాంగ్ చేశారు. ఇందులో వాళ్ళిద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ అదిరింది. ఇక నెటిజన్స్ వారి పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
యావర్ ని వదిలేసి నయని .. గౌతమ్ తో డేటింగ్ చేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్న వారికి గౌతమ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. తాను సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ పై స్పందించనని గౌతమ్ అన్నాడు. కానీ ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని .. మేము నటులం. బొమ్మతో అయినా మనిషితో అయినా ఒకేలా నటిస్తామని తెలిపాడు. అలాగే నయని నేను మంచి మిత్రులం. మనం అందరం మనుషులం. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టమని అర్థం చేసుకోండని అన్నారు.
నెగిటివ్ గా మాట్లాడేవారు .. వాళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తే బాగుపడతారు .. అంటూ ఇచ్చి పడేసాడు డాక్టర్ బాబు. ప్రస్తుతం గౌతమ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నయని – గౌతమ్ నటించిన తెలియదే పాటకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. బిగ్ బాస్ షో అనంతరం గౌతమ్ కృష్ణ కొంతలో కొంత ఫేమ్ తెచ్చుకున్నాడు. హీరోగా అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాడు. మనోడి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి…