Garikapati: గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్న ప్రముఖ పేర్లలో ఒకటి గరికపాటి నరసింహారావు(Garikapati Narasimharao). ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఇతని పై చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గరికపాటి ని ఆయన జీవిత కాలం లో ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా అన్ని బూతులు తిట్టి ఉండరు. అంత అవసరం కూడా ఎవరికీ ఉండదు. అన్యాయంగా గరికపాటి పై నోరు పారేసుకున్న అన్వేష్ పై జనాలు ఏ రేంజ్ కోపం తో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియా కి వస్తే నరికి చంపేస్తాం అనే రేంజ్ కోపం తో ఉన్నారు. అయితే గరికపాటి కూడా అన్వేష్ పేరు ని ప్రస్తావించకుండా, రెండు మూడు సార్లు కౌంటర్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటికి అన్వేష్ కూడా తిరిగి కౌంటర్లు ఇచ్చాడు.
ఇకపోతే గరికపాటి ప్రవచనల్లో ఎంతో లోతైన జీవిత సత్యాలు ఉంటాయి. వాటిని పాటించి గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సమాజం లో ఎలా బ్రతకాలి, ప్రస్తుత జీవన విధానానికి తగ్గట్టుగా సూచనలు ఇవ్వడం లో గరికపాటి తర్వాతే ఎవరైనా. రీసెంట్ గా ఆయన తన ప్రవచనల్లో పెళ్లి చేసుకోబోయే వధూవరులకు ఇచ్చిన ఒక సూచన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఏ ఇంట్లో అయినా తల్లిదండ్రులు తమ కూతురిని ఎలాంటి వ్యక్తికీ ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకుంటారు?, ఏడాదికి లక్షల ప్యాకేజీలు తీసుకునే వారినే ఉద్యోగులనే కదా?, కానీ అలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నాడు గరికపాటి. ప్యాకేజీలను, ఆస్తులను కాకుండా, ఎదుటి వ్యక్తిలోని సంతృప్తి ని చూసి సంబంధ కలుపుకోవాలని ఆయన జంటలకు సూచించాడు. మనిషి అనేవాడు ఆశావాది, ఆశ ఉండడం లో తప్పు లేదు, అత్యాశ ఉంటే మాత్రం జీవితం లో ఎదురు దెబ్బలు ఎదురుకోక తప్పదు.
నెలకు రెండు లక్షల రూపాయిల జీతం వచ్చిన సరిపొవట్లేదంటే అది అత్యాశే కదా?, అందుకే ప్యాకేజీల మీద ఆరాలు తీయకుండా, నీకు వచ్చే జీతంతో సంతోషంగా ఉన్నావా లేదా అని మాత్రమే అడగాలని, అప్పుడే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని ఆయన వివరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మనం ఎప్పుడైనా గరికపాటి చెప్పిన ఈ కోణం లో ఆలోచించామా?, లేదు కదా? , ఆయన చెప్పింది చూస్తుంటే నిజమే అని అనిపిస్తుంది కదా?, పెళ్లి చేసుకోవాలని అనుకునేవాళ్లు ఒకసారి అలోచించి చూడండి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినా ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
View this post on Instagram