https://oktelugu.com/

గంగవ్వతో ‘బిగ్ బాస్’ ఆట.. చూడాల్సిందే..!

కిందటి ఆదివారం నుంచే బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ షో ఇప్పటివరకు నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ పరంపరను కొనసాగించేందుకే ‘బిగ్ బాస్’ ఉవ్విళ్లురుతున్నాడు. బిగ్ బాస్-4 సీజన్లో ప్రస్తుతానికి 16మంది కంటెస్టులు ఎంట్రీ ఇచ్చారు. వివిధ రంగాల్లో ఫేమస్ అయిన 16మందిని ఒకేచోట చేర్పిన బిగ్ బాస్ ఇక ఆటకు సిద్ధమవుతున్నాడు. Also Read: జక్కన్న ప్లాన్ అదుర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ ఇక జెట్ స్పీడ్? తొలిరోజు బిగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2020 / 03:47 PM IST

    gangavva

    Follow us on


    కిందటి ఆదివారం నుంచే బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభమైంది. తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ షో ఇప్పటివరకు నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ పరంపరను కొనసాగించేందుకే ‘బిగ్ బాస్’ ఉవ్విళ్లురుతున్నాడు. బిగ్ బాస్-4 సీజన్లో ప్రస్తుతానికి 16మంది కంటెస్టులు ఎంట్రీ ఇచ్చారు. వివిధ రంగాల్లో ఫేమస్ అయిన 16మందిని ఒకేచోట చేర్పిన బిగ్ బాస్ ఇక ఆటకు సిద్ధమవుతున్నాడు.

    Also Read: జక్కన్న ప్లాన్ అదుర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ ఇక జెట్ స్పీడ్?

    తొలిరోజు బిగ్ బాస్-4 ఇంచుమించుగా బిగ్ బాస్-3 సీజన్ ను తలపించినట్లే కన్పించింది. దీంతో ఈ షోపై మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే రానున్నా రోజుల్లో బిగ్ బాస్ కొత్తకొత్త టాస్కులతో ఆకట్టుకునే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ప్రారంభం రోజు నుంచి బిగ్ బాస్ ఆట మొదలైట్టారు. కంటెస్టులకు కనెక్షన్ పేరుతో 14మందిని ఏడు జట్లుగా విడగొట్టాడు. ఇక మరో ఇద్దరిని ఓ సిక్రెట్ రూపంలో పెట్టడం ఆసక్తిని రేపుతోంది.

    బిగ్ బాస్ ఆట ప్రారంభం కావడంతోనే నామినేషన్ ప్రక్రియ షూరు అయింది. ఆదివారం రోజునే కనెక్షన్ గేమ్ లింక్ పెట్టి బిగ్ బాస్ నామినేషన్ గుట్టు విప్పేశాడు. ఏడు జంటల్లోంచి గంగవ్వ, సుజాత, సూర్య కిరణ్, అభిజీత్, అఖిల్ సర్తాక్, దివి, మెహబూబ్ నామినేట్ అయ్యారు. అయితే గంగవ్వ నామినేషన్ ప్రాసెస్ లో మాత్రం అందరూ ఒకటే రిజన్ చెప్పడం కొసమెరుపు. గంగవ్వకు ఫాలోయింగ్ ఎక్కువ ఉందని ఎలాగైనా సేవ్ అవుతుందని నామినేషన్ చేసినట్లు చెప్పారు.

    Also Read: జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు

    నిజంగానే గంగవ్వకు భారీ ఫాలోయింగ్ ఉండటంతో బిగ్ బాస్ సైతం ఆమెను బాగానే వాడాలని చూస్తున్నాడు. ఈ కారణంగానే గంగవ్వ మాట్లాడే మాటలు.. సైటర్లను ఎక్కవగా ఫోకస్ చేస్తున్నాడు. బిగ్ బాస్ వల్లే ప్రస్తుత సీజన్ కు హైప్ వచ్చినట్లు కన్పిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు అనుకూలంగా కామెంట్లు పెడుతున్నారు. ఓటింగ్ రేసులోని గంగవ్వ అందరికీ కంటే ముందుంది.

    50శాతం పైగా ఓట్లు ఆమె ఒక్కదానికే పోలైనట్లు తెలుస్తోంది. ఆమె దారిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. దీనిని బట్టి ఆమె రేంజ్ ఏంటో అర్థమవుతుంది. ఆమె వయస్సు రీత్య పెద్దది కావడంతో బిగ్ బాస్ విధించే టాస్కులను గంగవ్వ ఏమేరకు పూర్తి చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.