
Manchu Manoj- Maunika Son: మంచు మనోజ్ కొద్ది రోజుల క్రితమే దివంగత నేత భూమా నాగి రెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనిక ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.ఈ పెళ్లిని మంచు లక్ష్మి నివాసం లో చాలా సింపుల్ గా నిర్వహించారు.ఇక పెళ్ళైన దగ్గర నుండి ఈ జంట బయట తెగ తిరిగేస్తుంది.నిన్న అత్తవారి ఇంటికి వెళ్లి మౌనిక తాత గారి ఆశీస్సులు తీసుకున్న ఈ దంపతులు, నేడు తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకొని దర్శించుకున్నారు.
Also Read: Sania Mirza- Ram Charan: టెన్నిస్ కి సానియా మీర్జా గుడ్ బై… ఎమోషనల్ అయిన రామ్ చరణ్!
అనంతరం అక్కడికి వచ్చిన మీడియా తో మనోజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఆయన మాట్లాడుతూ ‘మౌనిక లాంటి మంచి అమ్మాయి నా జీవితం లోకి రావడం నా అదృష్టం గా భావిస్తున్నాను.నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు, గెలిచే తీరుతుంది,మా ఇద్దరి విషయం లో కూడా జరిగింది కూడా ఇదే.ఇక నా జీవితం లోకి బాబు రావడం శివుని ఆజ్ఞ.కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే బహుశా ఇదేనేమో’ అంటూ మనోజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
భూమా మౌనికా రెడ్డి కి గతం లో బెంగళూరు కి చెందిన గణేష్ రెడ్డి అనే ప్రముఖ పారిశ్రామిక వేత్తతో పెళ్లయింది, ఆ పెళ్ళికి అతిథిగా మనోజ్ కూడా వచ్చి ఉన్నాడు.అయితే వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణం గా రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు.వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు, మనోజ్ ఆమె కొడుకు ని తన కొడుకుగా మనస్ఫూర్తిగా స్వీకరించడం పై సర్వత్రా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తుంది.

ఇక మనోజ్ కెరీర్ విషయానికి వస్తే ఆయన వెండితెర మీద కనిపించిన చివరి చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’.ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన ఎలాంటి చిత్రం చెయ్యలేదు.మధ్యలో ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా ప్రారంభించాడు కానీ, ఎందుకో అది చివరికి కార్యరూపం దాల్చలేదు.ఇక ఆ తర్వాత ఆయన ‘వాట్ ది ఫిష్’ అనే చిత్రాన్ని ప్రారంభించాడు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.