Ganesh Ravuri: సినిమాల్లో ఫైట్స్ తో పాటు డైలాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అటువంటి డైలాగ్స్ చెప్పేవాళ్లని మాత్రం గుర్తు పెట్టుకుంటారు డైలాగ్ రాసిన వారు అందరికీ తెలియకపోవచ్చు. అయితే తన డైలాగులనుతో ఎన్నో చిత్రాలకు అందించారు, సోలో బ్రతుకే సో బెటర్’తోపాటు ఒకట్రెండు చిత్రాలకు ఒక వెర్షన్ డైలాగ్స్ రాశాను అన్నారు గణేష్ రావూరి.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం‘వరుడు కావలెను’ నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన సినిమా.తాజాగా విడుదలైన “వరుడు కావలెను” చిత్రానికి మాటలు అందించిన గణేష్ రావూరి విలేకరులతో మాట్లాడుతూ నిర్మాత వంశీగారు పిలిచి నువ్వు బాగా రాస్తావని విన్నాను, మా కొత్త సినిమాకు మాటలు ఒక వెర్షన్ రాసి ఇవ్వు, బాగుంటే చేద్దామని చెప్పారు. అలా ‘వరుడు కావలెను’ టీమ్‌లోకి వచ్చాను’’ అని మాటల రచయిత గణేష్ రావూరి అన్నారు.
నేను రాసిన మాటలు విని నిర్మాత చినబాబు గారు నవ్వడం నాకు అతి పెద్ద ప్రశంస కథలో కామెడీ, ఎమోషన్స్ కలిసి ఉంటాయి. ఈ రెండింటికీ మాటలు బాగా కుదిరాయి. హీరో హీరోయిన్ల పాత్రల పరిధి మేరకు మాటలు రాశాను. అయితే ఈ జర్నీలో త్రివిక్రమ్ గారి శైలిని నేను అనుసరించలేదు. ఆయనలా రాశానని ఎవరైనా చెబితే దాన్ని పెద్ద గౌరవంగా భావిస్తా వెన్నెల కిషోర్, హిమజ, శ్రావణి, ప్రవీణ్ పాత్రలు చేసిన కామెడీ కథలో నుంచి పుట్టిందే.భవిష్యత్తులో కమర్షియల్, మాస్ చిత్రాలకు మాటలు రాయాలని ఉంది అని అన్నారు.