Game Changer’ Trailer views : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. హైప్ విషయం లో ఈ చిత్రం వరకు ట్రైలర్ కి ముందు, ట్రైలర్ కి తర్వాత అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రైలర్ విడుదల తర్వాత ఫైర్ మోడ్ లో ఉన్నాయి. నార్త్ అమెరికా తో పాటు లండన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ గత రెండు రోజులతో పోలిస్తే భారీ రేంజ్ లో పెరిగింది. నార్త్ అమెరికా లో ఇప్పటికే ఈ చిరం హాఫ్ మిలియన్ మార్క్ ప్రీ సేల్స్ ని దాటగా, లండన్ లో లక్ష డాలర్లు, ఆస్ట్రేలియా లో 50 వేల డాలర్లు వచ్చాయి. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ తారా స్థాయికి చేరుకుంటుందని, విడుదలకు ముందే రెండు మిలియన్ డాలర్ల ప్రెస్ సేల్స్ ఓవర్సీస్ నుండి వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ కి ఆల్ టైం టాప్ 2 స్థానం దక్కింది. 24 గంటల్లో ఈ సినిమా ట్రైలర్ కి 38 మిలియన్ వ్యూస్ , 5 లక్షల 32 వేల లైక్స్ వచ్చాయి. ఈ ట్రైలర్ కి ముందు స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్ కి 24 గంటల్లో 44 మిలియన్ వ్యూస్ రాగా, 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అందరూ పుష్ప 2 ని కచ్చితంగా కొట్టేస్తుందని అనుకున్నారు కానీ, తృటిలో మిస్ అయ్యింది. ఫుల్ రన్ లో తెలుగు వెర్షన్ పుష్ప 2 ట్రైలర్ కి 58 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హిందీ లో అయితే ఏకంగా వంద మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఆ రేంజ్ లో ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ కి రావడం ప్రస్తుతం కష్టమే.
కానీ 24 గంటల వ్యూస్ ని పరిగణలోకి తీసుకుంటే ‘గేమ్ చేంజర్’ చిత్రానికి హిందీ 15 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అనే చెప్పొచ్చు. అదే విధంగా తమిళం లో ఈ సినిమా ట్రైలర్ కి 24 గంటల్లో 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అనే చెప్పాలి. శంకర్ కి తమిళనాట మంచి క్రేజ్ ఉండడం, ట్రైలర్ బాగుంది అనే టాక్ రావడంతో అక్కడి ఆడియన్స్ ఈ సినిమా ట్రైలర్ ని బాగా వీక్షించారు. ఫుల్ రన్ లో ఈ ట్రైలర్ కి ఎన్ని వ్యూస్ వస్తాయో చూడాలి. ఈ ట్రైలర్ ప్రభావం ఓపెనింగ్స్ మీద కూడా బలంగా పడే అవకాశాలు ఉన్నాయి, తమిళనాట మొదటి రోజు ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంటున్నారు.