Maharashtra Politics : గుర్రం ఎగురా వచ్చు.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. మహారాష్ట్రలో ఇప్పుడు అలాంటి పరిణామాలే జరుగుతున్నాయి. అటు ఎన్సీపీ గ్రూపులో, ఇటు ఉద్దవ్ ఠాక్రే గ్రూపులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో తాజాగా అజిత్ పవార్ వెళ్లి శరద్ పవార్ ను కలిశారు. అక్కడి నుంచి మొదలైంది.అంతకన్నా ముఖ్యమైన పరిణామం ఏంటంటే.. అజిత్ పవార్ తల్లి కొత్త సంవత్సరం వేళ దేవాలయానికి వెళ్లి ‘మళ్లీ కుటుంబమంతా ఒక్కటి కావాలి’ అని పేర్కొనడం.. మీడియాలో రావడంతో అటెన్షన్ నెలకొంది. ఇదే ట్రిగ్గర్ పాయింట్ అయ్యింది.
ప్రాపుల్ పటేల్ కూడా శరద్ పవార్ ఆధ్వర్యంలో అందరూ కలిసిపోవాలని.. ఒక్కటి కావాలని పిలుపునిచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ వర్గం ఎక్కువ సీట్లు పొందలేదు. అజిత్ పవార్ వర్గమే మెజార్టీ సీట్లు సాధించింది. దీంతో శరద్ పవార్ కూతురు సుప్రీయా సూలే కూడా కాస్త తగ్గి అజిత్ పవార్ కు మద్దతు పలికింది. మేమంతా ఒక్కటే కుటుంబమని స్టేట్ మెంట్ ఇచ్చింది. అంతేకాకుండా ఫడ్నవీస్ బాగా పనిచేస్తున్నాడని.. నక్సలిజాన్ని అరికట్టాడని ప్రశంసించింది.
ఇక శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గంలోనూ ఇటువంటి పరిణామాలే జరుగుతున్నాయి. ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలు వచ్చి స్వయంగా సీఎం ఫడ్నవీస్ ను కలిశారు. శివసేన మీటింగ్ లో ‘సంజయ్ రౌత్’ను కొట్టి రూంలో వేసి తాళం పెట్టారు. శివసేన బీజేపీ విడిపోవడానికి నువ్వే కారణం అని సంజయ్ రౌత్ పై దాడులు చేశారు. దీంతో సంజయ్ రౌత్ తాజాగా శివసేన పత్రికలో సీఎం ఫడ్నవీస్ ను పొగుడుతూ ఆయన పాలనను ప్రశంసిస్తూ సంపాదకీయం రాశాడు..
శరద్ పవర్ ఉద్దవ్ ఠాక్రే పార్టీలు ఫడ్నవీస్ కి మద్దతుగా నిలుస్తున్నాయా? మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.