https://oktelugu.com/

Game Changer: ‘దేవర’, ‘పుష్ప 2’ లను దాటేసిన ‘గేమ్ చేంజర్’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..’కల్కి’ రికార్డు డేంజర్ లో పడనుందా?

ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు తమ పరిధిని మించి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంతు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో ఆయన హీరో గా నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం వచ్చే నెల సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 05:05 PM IST

    game changer

    Follow us on

    Game Changer: ఈ ఏడాది మన టాలీవుడ్ స్టార్ హీరోలకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం అభిమానులను, ప్రేక్షకులను నిరాశపరిచింది కానీ , ఆ తర్వాత మన స్టార్ హీరోల నుండి విడుదలైన ‘కల్కి’, ‘దేవర’, ‘పుష్ప 2’ చిత్రాలు మన టాలీవుడ్ స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లి పెట్టాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ చిత్రం అయితే మొదటి వారంలోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇలా ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు తమ పరిధిని మించి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంతు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో ఆయన హీరో గా నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే నెల సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

    ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ వారం రోజుల క్రితమే మొదలయ్యాయి. ముందుగా లండన్ ప్రాంతంలో బుకింగ్స్ ప్రారంభించగా, మొన్న సాయంత్రం నుండి నార్త్ అమెరికా లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. 324 షోస్ కి సంబంధించిన బుకింగ్స్ మొదలు పెట్టగా, ఇప్పటి వరకు 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ గ్రాస్ మొత్తం రెగల్, AMC చైన్స్ నుండే వచ్చాయట. అక్కడ ఎక్కువ మన టాలీవుడ్ కి భారీ స్థాయిలో గ్రాస్ వసూళ్లు వచ్చేది సినీ మార్క్ షోస్ నుండి. ఇప్పటి వరకు సినీ మార్క్ కి సంబంధించి కేవలం నాలుగు షోస్ కి మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. ఈ నాలుగు షోస్ నుండి 14 వేల డాలర్లు వచ్చాయట.

    ఇది ‘దేవర’, ‘పుష్ప 2’ చిత్రాల యావరేజ్ కంటే ఎక్కువ అని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. ఇక రెగల్, AMC షోస్ నుండి దాదాపుగా 36 వేల డాలర్లు వచ్చాయి. స్లో గా బుకింగ్స్ జరిగే ఇలాంటి చోటనే ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ నెల రోజుల ముందే జరిగాయంటే, ఇక సినీ మార్క్ లో పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే ఏ రేంజ్ ర్యాంపేజ్ ఉంటుందో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రం ‘దేవర’ మూవీ ప్రీమియర్ షోస్ గ్రాస్ వసూళ్లను దాటే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ ట్రెండ్ ని చూపిస్తే కల్కి చిత్రం రేంజ్ గ్రాస్ వసూళ్లను ప్రీమియర్స్ నుండే సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈరోజు రాత్రి, లేదా రేపు ఉదయం లోపు ఈ సినిమాకి సంబంధించి పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించబోతున్నారట.