https://oktelugu.com/

CM Chandrababu: ప్రతి సోమవారం పోలవరం.. చంద్రబాబు ప్రత్యేక ఫోకస్.. ఇక పరుగులే

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అటు కేంద్ర సహకారం సైతం లభిస్తుండడంతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు.

Written By:
  • Dharma
  • , Updated On : December 16, 2024 / 04:57 PM IST

    CM Chandrababu(4)

    Follow us on

    CM Chandrababu: ఏపీ జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆరు అడుగుల వెనక్కి చందంగా మారింది ఈ ప్రాజెక్టు పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కదలిక వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా దృష్టి పెడతామని హామీ ఇచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో సైతం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులెట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు బాబు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుపై తన అంకిత భావాన్ని మరోసారి బయటపెట్టారు బాబు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కూడా చంద్రబాబు ప్రాజెక్టు పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రతి నెల సోమవారం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి సమీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు.

    * బహుళార్థక సాధక ప్రాజెక్టు
    ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఏపీ స్వరూపాన్ని మార్చనుంది. గోదావరి జిల్లాలతో పాటు సమీప ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుంది. 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనుంది. అందుకే ఈ ప్రాంత రైతులు చంద్రబాబుపై ఆశలు పెట్టుకున్నారు . కూటమి ప్రభుత్వం 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తాజాగా చంద్రబాబు మాత్రం 2026 నాటికి పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్త నడకన సాగాయి.

    * పునరావాసానికి కొత్త ఊపిరి
    మరోవైపు పునరావాస పనులకు సంబంధించి నీలి నీడలు కమ్ముకున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పునరావాస పనులకు పునరుజ్జీవం వచ్చింది. 13 పునరావాస కాలనీల నిర్మాణానికి 210 కోట్ల పాత బకాయిలు చెల్లించి.. పునరావాసానికి 502 కోట్లు రూపాయలు అదనంగా కేటాయించింది. ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 12 వేల ఎకరాల భూమిని సేకరించింది ప్రభుత్వం. 25 వేల కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ప్రస్తుతం 44 గ్రామాల్లో పునరావాస సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

    * సీఎం టూర్ సక్సెస్
    ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు సీఎం చంద్రబాబు. డయాఫ్రం వాల్ నిర్మాణం, రాక్ ఫీల్ డాం పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో 2026 నాటికే ప్రాజెక్టు పూర్తిచేసేలా పనిచేయాలని యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.చంద్రబాబు తాజా ఆదేశాలతో ఉభయగోదావరి జిల్లాల ప్రజలు, అటు నిర్వాసితుల్లో కొత్త ఆశలు రేగుతున్నాయి.