Game Changer Collections : సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఈమధ్య కాలం లో చిన్న హీరో , పెద్ద హీరో అని తేడా లేదు. ఎవరికైనా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు వస్తున్నాయి. కానీ ఫ్లాప్ టాక్ తో కూడా భారీ వసూళ్లను రాబట్టే వాడే నిజమైన సూపర్ స్టార్. ఈ విషయం లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని మెచ్చుకోకుండా ఉండలేము. ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదల రోజు అభిమానులు ఉదయం నిద్ర లేచే లోపే అన్ని వెబ్ సైట్స్ లోనూ రేటింగ్స్ దారుణంగా వచ్చేసాయి. అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఆరేళ్ళ తర్వాత వస్తున్న రామ్ చరణ్ సినిమా, మూడేళ్లు ఈ చిత్రం కోసం కష్టపడ్డాడు. అలాంటి సినిమాకి ఇంత నెగటివ్ టాక్ వస్తే ఎంత బాధ వేస్తుంది?..
అయితే హీరో బాక్స్ ఆఫీస్ స్టామినా ఒక రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాకి రెండవ రోజు బుక్ మై షో యాప్ లో ఏకంగా నాలుగు లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. గత సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రానికి రెండవ రోజు కేవలం లక్ష 40 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఆ సినిమాకి రెండు రెట్లు ఎక్కువ రాబట్టింది ‘గేమ్ చేంజర్’ చిత్రం. దీనిని బట్టి రామ్ చరణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నేడు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 19 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.
కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మూడవ రోజు ఏకంగా గంటకి 19 వేల 500 టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ మరియు నైజాం ప్రాంతం తప్ప, ఆంధ్రలో ఈ సినిమాకి మంచి వసూళ్లే వస్తున్నాయి. అదే విధంగా బాలీవుడ్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే బుక్ మై షో యాప్ లో ఆ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఊపు చూస్తుంటే సంక్రాంతికి ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండవ రోజు ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నైజాం తో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్లు బాగా పడిపోయాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాలయ్య సినిమాకంటే గేమ్ చేంజర్ కి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.