https://oktelugu.com/

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్టనర్ ఫిక్స్… దేనిలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?

ఓవర్సీస్ నుండి అభిమానులు కారణంగా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ రెగ్యులర్ షోస్ నుండి కామన్ ఆడియన్స్ యావరేజ్ టాక్ మాత్రమే ఇచ్చారు. కొంతమంది ఫ్లాప్ అని కూడా సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయనే చెప్పొచ్చు.

Written By:
  • Rocky
  • , Updated On : January 11, 2025 / 08:13 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్.. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అభిమానులు దానిపై భారీ అంచనాలను పెంచుకుని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది శంకర్ కు తొలి డైరెక్ట్ తెలుగు సినిమా. అంతే కాకుండా నిర్మాత దిల్ రాజుకు కూడా తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో, ట్రేడ్ వర్గాలు కూడా దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దానికి తోడు, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచడంతో మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా సినిమా ఎలా ఉంటుందో చూడటానికి ఆత్రుతగా ఎదురు చూశారు. వారి ఎదురు చూపులు ఫలించి ఈ సినిమా ఈరోజు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    ఓవర్సీస్ నుండి అభిమానులు కారణంగా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ రెగ్యులర్ షోస్ నుండి కామన్ ఆడియన్స్ యావరేజ్ టాక్ మాత్రమే ఇచ్చారు. కొంతమంది ఫ్లాప్ అని కూడా సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయనే చెప్పొచ్చు. ఓవర్సీస్ లో బాగా దెబ్బ పడింది కానీ, ఇండియా వైడ్ గా మాత్రం దుమ్మురేపింది. అర్థరాత్రి షోస్ కారణంగా నూన్ , మ్యాట్నీ షోస్ కాస్త తగ్గిపోయాయి కానీ, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ మాత్రం దుమ్ము లేపేసాయి అని చెప్పొచ్చు.

    ఇదిలా ఉండగా, ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల టైటిల్ కార్డులలో మేకర్స్ ఈ విషయాన్ని ఈరోజు ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ గేమ్ ఛేంజర్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, విడుదలైన ఎనిమిది వారాల తర్వాత సినిమాను స్ట్రీమ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ రూ. 104 కోట్లు పలికాయని సమాచారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన గేమ్ ఛేంజర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన ముఖ్యంగా అభిమానులను, ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. శంకర్ ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా డైరెక్ట్ చేసాడని, “జరగండి” పాట సరైన రేంజ్ లో ఉందని కామెంట్స్ వస్తున్నాయి.