Game Changer: ‘గేమ్ చేంజర్’ ప్రోమో విడుదల తేదీ వచ్చేసింది..కొత్త పోస్టర్ లో రామ్ చరణ్ లుక్స్ అదుర్స్!

వినాయక చవితి రోజు ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ ని విడుదల చేసి ఈ నెల లో 2 వ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. 'రా మచ్చ మచ్చ' అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియో ఈ నెల 28 వ తారీఖున విడుదల చేయబోతున్నారట. ఇదే పాటకు సంబంధించిన మొదటి పోస్టర్ లో రామ్ చరణ్ ఎర్ర తువ్వా తలకు చుట్టుకొని మాస్ గా కనిపించిన సంగతి తెలిసిందే.

Written By: Vicky, Updated On : September 25, 2024 5:16 pm

Game Changer(1)

Follow us on

Game Changer: ‘గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. #RRR తర్వాత రామ్ చరణ్ శంకర్ తో చేతులు కలపబోతున్నాడు అనే వార్త వచ్చినప్పుడు ఇండస్ట్రీ షేక్ అయ్యింది. కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ రావడం వల్ల ఒకప్పుడు ఉన్న హైప్ ఇప్పుడు లేదు, చాలా వరకు తగ్గింది. అభిమానులు ఈ చిత్రం నుండి కనీసం ఒక గ్లిమ్స్ వీడియో ని అయినా విడుదల చేయండి అని మేకర్స్ ని అనేక పద్ధతుల్లో అడిగేందుకు ప్రయత్నం చేసారు. కానీ మేకర్స్ ఇప్పటి వరకు కేవలం సోషల్ మీడియా లో లీక్ అయిన ‘జరగండి..జరగండి’ అనే పాటని మాత్రమే విడుదల చేసారు. ఈ పాటకు ఫ్యాన్స్ నుండి, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ చిత్రం నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడం తో రామ్ చరణ్ అభిమానులు కోపం తో డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు ని ట్యాగ్ చేసి తిడుతూ నేషనల్ వైడ్ గా నెగటివ్ ట్రెండ్ చేసారు. దీంతో మూవీ టీం దెబ్బకు దిగొచ్చింది.

వినాయక చవితి రోజు ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ ని విడుదల చేసి ఈ నెల లో 2 వ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. ‘రా మచ్చ మచ్చ’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియో ఈ నెల 28 వ తారీఖున విడుదల చేయబోతున్నారట. ఇదే పాటకు సంబంధించిన మొదటి పోస్టర్ లో రామ్ చరణ్ ఎర్ర తువ్వా తలకు చుట్టుకొని మాస్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫార్మల్ డ్రెస్ లుక్స్ తో అద్దాలు పెట్టుకొని, స్టైలిష్ గా కనిపించాడు. ఈ పాట ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని, కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా, తమిళం, హిందీ భాషలకు సంబంధించిన ఆడియన్స్ కూడా ఈ పాటను బాగా ఎంజాయ్ చేస్తారని, ఈ పాటలో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయని అంటున్నారు.

మరి పూర్తి లిరికల్ వీడియో సాంగ్ ఎప్పుడు విడుదల అవ్వబోతుంది అని అభిమానుల్లో మెలుగుతున్న ప్రశ్న. 28 వ తారీఖున విడుదల చేయబోయే ప్రోమో లోనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ డేట్ ఉంటుందని సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య , సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా, థమన్ సంగీతం అందించారు. ఈసారి థమన్ తన స్టైల్ లో కాకుండా శంకర్ స్టైల్ లో పాటలను కంపోజ్ చేసాడు.