https://oktelugu.com/

Harsha Sai: బయటపడ్డ యూట్యూబర్ ‘హర్ష సాయి’ అరాచకాలు..సంచలనం మారిన సీసీటీవీ వీడియో!

హర్ష సాయి కి సంబంధించిన ఒక సీసీటీవీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. ఒక హోటల్ కి హర్ష సాయి, మిత్రా శర్మ తో కలిసి వెళ్లగా, అక్కడ ఎదో ఒక విషయం లో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో బాధితురాలు కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుండగా, హర్ష సాయి తన మొబైల్ లో ఉన్న వీడియో ని చూపించి ఆమెని ఆపుతాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 25, 2024 / 05:37 PM IST

    Harsha Sai

    Follow us on

    Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ ‘హర్ష సాయి’ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ మిత్రా శర్మ నార్సింగి పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు నమోదు చేసిన సంఘటన సంచలనం గా మారింది. జానీ మాస్టర్ పై ఇలాంటి కేసు నమోదు అయ్యి, ఆయన జైలుకు వెళ్లిన వారం లోపే, మరో సెలబ్రిటీ ఇలాంటి రేప్ కేసు లో చిక్కుకోవడం గమనార్హం. యూట్యూబ్ లో ఆసక్తికరమైన కంటెంట్ ని ఇస్తూ, కోటి మందికి పైగా సబ్ స్క్రైబర్స్ ని సంపాదించిన హర్ష సాయి కి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఒక స్టార్ హీరో కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో, ఇతనికి సోషల్ మీడియా లో అలాంటి క్రేజ్ ఉంటుంది. యూట్యూబ్ ద్వారా ఇంతటి క్రేజ్ సంపాదించిన ఈయన హీరో గా మారి ‘మెగా’ అనే చిత్రం కూడా మొదలు పెట్టాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మిత్రా శర్మ నే హర్ష సాయి పై కేసు పెట్టింది.

    ఈ నేపథ్యం లో హర్ష సాయి కి సంబంధించిన ఒక సీసీటీవీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. ఒక హోటల్ కి హర్ష సాయి, మిత్రా శర్మ తో కలిసి వెళ్లగా, అక్కడ ఎదో ఒక విషయం లో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో బాధితురాలు కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుండగా, హర్ష సాయి తన మొబైల్ లో ఉన్న వీడియో ని చూపించి ఆమెని ఆపుతాడు. ఇంతకు అతను చూపించిన ఆ వీడియో ఏమిటి?, ఆ అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ వీడియో చూపించి బెదిరించాడా? అని సోషల్ మీడియా లో ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మరోపక్క హర్ష తన ఇంస్టాగ్రామ్ లో ఈ ఘటనపై స్పందిస్తూ ‘నేను ఎలాంటి వాడినో నా అభిమానులకు తెలుసు..ఆ అమ్మాయి కేవలం నా దగ్గర డబ్బులు గుంజుకోవడం కోసమే ఇదంతా చేస్తుంది. త్వరలోనే ఆధారాలు బయటపెడుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు. మరోపక్క మిత్రా శర్మ ఇచ్చిన ఫిర్యాదు పై FIR నమోదు చేసిన పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నారు.

    వైజాగ్ తో పాటు ముంబై లో కూడా పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతానికి అతను ముంబై లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హర్ష సాయి ఈ అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మోసం చేసాడట. అంతే కాదు ఈ అమ్మాయి దగ్గర రెండు కోట్ల రూపాయిలు కూడా తీసుకున్నాడట. హర్ష సాయి తండ్రి దగ్గరుండి ఇవన్నీ చేయిస్తున్నాడని అతని తండ్రి పై కూడా మిత్రా శర్మ కేసు నమోదు చేసింది. ఇండస్ట్రీ లో వరుసగా ఇలా ప్రముఖ సెలబ్రిటీస్ పై రేప్ కేసులు రావడాన్ని చూస్తుంటే అసలు సినీ పరిశ్రమలో ఏమి జరుగుతుంది అని నిలదీస్తున్నారు నెటిజెన్స్. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.