Game Changer Pre Release Event : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు ఆయనకు మంచి విజయాలను అందించడమే కాకుండా స్టార్ హీరోగా మంచి గుర్తింపును తీసుకువచ్చి పెట్టాయి. ఇక గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన సూపర్ సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా ఈ నెల 10వ తేదీన రిలీజ్ అవ్వనున్న నేపథ్యం లో ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు కండక్ట్ చేశారు. మరి మొత్తానికైతే ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారనే చెప్పాలి. ఇక ఈ ఈవెంట్లో సినిమా దర్శకుడు అయిన శంకర్ మాట్లాడుతూ ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా డిసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పారు. అలాగే ఈ సినిమా స్టోరీ మొత్తం ఒక కలెక్టర్ కి ఒక మినిస్టర్ కి మధ్య జరిగే వార్ లా నడుస్తుందంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరి మొత్తానికైతే శంకర్ గేమ్ చేంజర్ స్టోరీ చెప్పడం వెనక కారణం ఏంటి? ఎందుకు చెప్పేసాడు అంటూ కొంతమంది మెగా అభిమానులు చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ స్టోరీ రివిల్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఈవెంట్ కి వచ్చాడు అంటే ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ తన అన్న కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చారని చాలా మంది అనుకుంటారు.
ఒక విధంగా ఆయన రామ్ చరణ్ కోసం వచ్చినప్పటికి సినిమా కథలో హీరో నిజాయితీగా పోరాటం చేసే వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో జనానికి ఏం కావాలి అనేది తెలుసుకుంటాడు. తద్వారా హీరో నిజాయితీ ఉన్న వ్యక్తి కాబట్టి దీన్ని ప్రమోట్ చేసిన తప్పు లేదనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి అయితే వచ్చాడు…
ఇక సమాజానికి హాని చేసే సినిమా అయితే పవన్ కళ్యాణ్ వచ్చేవాడు కాదనే ఉద్దేశ్యంతోనే స్టోరీని రివిల్ చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలైతే భారీగా పెరిగిపోయాయి. తర్వాత ఈ సినిమా కోసం ఆసక్తి ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి.