https://oktelugu.com/

Game Changer: గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది….మరి అనుకున్న టైమ్ కి వస్తుందా..?

చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒక ప్రస్తుతం ఆ గుర్తింపుతోనే పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక గ్లోబల్ స్టార్ గా కూడా తనను తాను మార్చుకున్న విధానం చూస్తే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగిస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 20, 2024 / 01:56 PM IST

    Game Changer Movie

    Follow us on

    Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించిన ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న జనాలకి సైతం చాలా దగ్గర అయ్యాడు. అందుకే ఇప్పుడు ఆయన నుంచి వచ్చే సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుంది అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు సైతం విపరీతంగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈయన శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా దాదాపు రెండు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇక ఎట్టకేలకు సినిమా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనుకున్న డేట్ కి వస్తే ప్రాబ్లం లేదు. కానీ మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే మాత్రం ఈ సినిమా మీద నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం అయితే ఉంది…ఇక రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయి భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో శంకర్ మీద ఎలాంటి నమ్మకం అయితే అభిమానులకు లేదు.

    రామ్ చరణ్ ఎలాంటి మ్యాజిక్ ను చేస్తాడు అనే దానిమీదనే ప్రేక్షకులు గానీ, అభిమానులు గానీ భారీ అంచనాలు పెట్టుకున్నారు.మరి వీళ్ళు అనుసరిస్తున్న విధానం ప్రకారం ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలుస్తుంది అంటూ మేకర్స్ అయితే భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తేనే శంకర్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ క్రియేటవుతుంది.

    మరి కొంతమంది పెద్ద హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు. లేదంటే మాత్రం ఇకమీదట ఆయన మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక ఈ సినిమా సక్సెస్ అనేది రామ్ చరణ్ కంటే కూడా శంకర్ కే చాలా కీలకంగా మారిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధిస్తాడు అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా లేదా అనేది…