Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలై ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుందో మన అందరికీ తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన చిత్రమిది. డైరెక్టర్ శంకర్ చాలా సాదాసీదాగా ఈ సినిమాని తీయడం వల్ల, మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. మెగా అభిమానులకు ఒక మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను మిగిలించింది ఈ చిత్రం. అయితే ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాకి వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ బ్రేక్ ఈవెన్ కి అవి ఏ మాత్రం సరిపోవు. బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ సినిమా రాబట్టాలి.
టాక్ వచ్చి ఉంటే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా రాబట్టి ఉండేది. కానీ రామ్ చరణ్ బ్యాడ్ లక్ అలా ఉంది. ఇప్పటి వరకు కనీసం 50 శాతం రికవరీ ని కూడా చేయలేదు ఈ చిత్రం. ఈ వీకెండ్, ఆ తర్వాత రిపబ్లిక్ డే కలుపుకొని ఒక డీసెంట్ నెంబర్ ని రాబడుతుందని బయ్యర్స్ ఆశపడుతున్నారు. ఈ నాలుగు రోజుల్లో ఈ చిత్రం 50 శాతం రికవరీ రేట్ ని దాటుతుందని ఆశిస్తున్నారు. అయితే ‘గేమ్ చేంజర్’ తో పాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కూడా కాంబినేషన్ లో దిల్ రాజు బయ్యర్స్ కి అమ్మగా, గేమ్ చేంజర్ నష్టాలను ఈ చిత్రం పూడ్చేసింది. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ నుండి ఎంత వసూళ్లు వచ్చినా అవి బోనస్ లెక్కే అనొచ్చు. ఇదంతా పక్కన పెడితే బుక్ మై షో యాప్ లో ఈ చిత్రం సరికొత్త రికార్డుని నెలకొల్పింది.
ఇప్పటి వరకు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా 2.2 మిలియన్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయట.డిజాస్టర్ చిత్రాలలో ఇది ఒక ఆల్ టైం రికార్డు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. గత ఏడాది సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన మహేష్ బాబు గుంటూరు కారం చిత్రానికి కూడా ఇదే స్థాయి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 1.68 మిలియన్ టికెట్స్ సేల్ అయ్యాయి. ఈ మార్కుని గేమ్ చేంజర్ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే దాటేసింది. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి 112 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. హిందీ లో 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.