Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మూడేళ్ళ అభిమానులు, ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరదించుతూ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఏమాత్రం లేకపోవడం తో అభిమానులు తీవ్ర స్థాయిలో నిరాశకి గురయ్యారు. డైరెక్టర్ శంకర్ కి బుర్ర పూర్తిగా చెడిపోయి ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు అంటూ ఆయనపై మండిపడ్డారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. అంటే గ్రాస్ వసూళ్లు దాదాపుగా 500 కోట్లు రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా కేవలం 300 కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ ఏదైనా మ్యాజిక్ చేస్తే లాంగ్ కూడా ఉండొచ్చు.
ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ దురాభిమానుల ఈ సినిమాకి సంబంధించిన HD ప్రింట్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసేసారు. ఈ ప్రింట్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో కొంతమంది దురాభిమానులు షేర్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అసలే సినిమాకి టాక్ లేదు అని నిర్మాత దిల్ రాజు ఏడుస్తుంటే, ఇక్కడ ఏమాత్రం మానవత్వం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వీళ్ళపై మూవీ టీం ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోకపోవడమే. సోషల్ మీడియా లో ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఓటీటీ కి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ నిర్మాత దిల్ రాజు కి పెద్ద తలనొప్పిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ సుమారుగా 140 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్స్ లో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీ లో విడుదల చేయాలి. కానీ ఈ చిత్రానికి నెగటివ్ టాక్ బాగా వ్యాప్తి చెందడంతో ముందు అనుకున్న డేట్ కంటే తొందరగా విడుదల చేయాలనీ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు నిర్మాత దిల్ రాజు పై ఒత్తిడి చేస్తున్నారట. దీంతో ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారం లోనే అమెజాన్ ప్రైమ్ లో అప్లోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి దిల్ రాజు అందుకు ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి. రెండవ రోజు వసూళ్లు చూస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకునేలాగానే అనిపిస్తుంది. కానీ ముందస్తుగా ఓటీటీ లో విడుదల చేస్తే మాత్రం చాలా రెవిన్యూ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, ఏమి జరగబోతుందో చూడాలిమరి.