https://oktelugu.com/

Delhi Liquor Policy: అరవిందా.. ఎంతపనిచేస్తివి.. ఢిల్లీ మద్యం పాలసీతో రూ.2,026 కోట్ల నష్టం.. కాగ్‌ సంచలన నివేదిక!

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించి తెలుగు రాష్ట్రాలకూ పాకిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. ఢిల్లీకి భారీగా నష్టాన్ని మిగిల్చింది. ఈ కేసు కారణంగా ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎం పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఆర్థికంగా కూడా భారీగా నష్టం జరిగిందట.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 11, 2025 / 05:22 PM IST

    Delhi Liquor Policy

    Follow us on

    Delhi Liquor Policy: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అధికార ఆప్‌ మరోసారి గెలవాలని ప్రయత్నిస్తోంది. ఇక ఈసారి ఢిల్లీలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ కష్టపడుతోంది. ఈ తరుణంలో విడుదలనై కాంట్రోల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) రిపోర్టు ఇప్పుడు మాజీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌(Aravind kezrewal)కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీలోని లోపాలను ఇందులో వివరించింది. మద్యం పాలసీ మార్పుతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,026 కోట్ల నష్టం జరిగిందని నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం దేశ రాజధానిలో మద్యం వాపారం నష్టాల్లో ఉన్నప్పటికీ ఆప్‌ ప్రభుత్వం కొంత మంది బిడ్డర్లకు లైసెన్స్‌లు ఇచ్చిందని ఆకంగ్రె పేర్కొంది. పాలసీ అమలులోని లోపాలను ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల కారణంగా సర్కార్‌కు రూ.2,026 కోట్ల నష్టం వాటిలిందని తెలిపింది. ఈ నష్టానికి సామాన్యులు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని పేర్కొంది. ఆప్‌ నేతలు మాత్రం భారీగా కమీషన్లు అందుకున్నట్లు తెలిపింది.

    నేతల పేర్లు కూడా..
    కాగ్‌ నివేదికలో కొంత మంది నేతల పేర్లు కూడా పేర్కొంది. నాటి ఎక్సైజ్‌ మినిస్టర్‌గా వ్యవహరించిన మనీష సిసోడియాతోపాటు అతని మంత్రుల బృందం నిపుణుల ప్యానెల్‌ సిఫారసులను విస్మరించిందని నివేదిక వెల్లడించింది. మద్యం దుకాణాల లైసెన్సుల జారీ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపింది. కీలక నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారని పేర్కొంది. కేబినెట్‌(Cabinet) నుంచి గానీ, గవర్నర్‌ నుంచి ఆమోదం తీసుకోలేదని తెలిపింది.

    కాగ్‌ పేర్కొన్న కీలక అంశాలు..

    – కొత్త మద్యం పాలసీ, విధానంలో లోపాల కారణంగా రూ.2,026 కోట్ల నష్టం జరిగింది.

    – మద్యం విధానం రూపొందించే ముందు నిపుణులను సంప్రదించలేదు. కానీ వారి సిఫారసులను కూడా పాటించలేదు.

    – ఫిర్యాదులు ఎదుర్కొంటున లేదా నష్టాల్లో నడుస్తున్న కంపెనీలకు కూడా లైసెన్సులు జారీ చేశారు.

    – అనేక కీలర నిర్ణాయలలో క్యాబినెట్(Cabinate), లెఫ్టినెంట్‌ గవర్నర్‌(Governar) ఆమోదం తీసుకోలేదు.

    – మద్యం ధరల విషయంలో, లైసెన్సుల జారీ విషయంలో పారదర్శకత లోపించింది.

    – మద్యం నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రయోగ శాలలు, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఉన్నవాటిలో సౌకర్యాలు కల్పించలేదు. ఇక రిటైన్‌ షాపులను అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ చేయలేదు.

    – కోవిడ్‌–19 పేరుతో రూ.144 కోట్ల విలువైన లైసెన్స్‌ ఫీజులను మాఫీ చేశారు. అయితే అలా చేయాల్సిన అవసరం లేదు.
    – జోనల్‌ లైసెన్స్‌దారులు ఇచ్చిన రాయితీల ఫలితంగా రూ.941 కోట్ల నష్టం జరిగింది.

    – సెక్యూరిటీ డిపాజిట్లు సరిగా రికవరీ చేయకపోవడంతో రూ.27 కోట్ల నష్టం జరిగింది.

    – ఉపసంహరించిన లైసెన్సులకు టెండర్లు పిలవకపోవడంతో రూ.890 కోట్ల నష్టం జరిగింది.

    – కోవిడ్‌ సాకుతో ప్రభుత్వం రూ.144 కోట్ల లైసెన్స్‌ ఫీజు మాఫీ చేసింది. దీంతో మరింత ఆదాయం తగ్గింది.

    – సెక్యూరిటీ డిపాజిట్‌ను తప్పుగా డిపాజిట్‌ చేయడం వలన రూ.27 కోట్ల నష్టం జరిగింది.