Game Changer Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ ఫలితం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు నుండే ఈ చిత్రం హైప్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. అభిమానులు కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో ఉండేవారు కానీ, నార్మల్ ఆడియన్స్ ని మాత్రం ఈ చిత్రం ప్రీ రిలీజ్ కంటెంట్ అసలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది అనేది నిర్మాత దిల్ రాజు సైతం విడుదలకు ముందు ఒప్పుకున్నాడు. కేవలం రామ్ చరణ్ అనే పేరు మీదనే ఈ సినిమా బిజినెస్ మొత్తం జరిగింది. విడుదల తర్వాత టాక్ రాకపోయినా కూడా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే అది కేవలం రామ్ చరణ్ వల్లే అన్ని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీ లో ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి.
మొదటి రోజు హిందీ వెర్షన్ కి దాదాపుగా 9 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు కాస్త డ్రాప్ అయ్యినప్పటికీ, మూడవ రోజు మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్స్ లో ఈ చిత్రం ఆడుతూనే ఉంది కానీ, నెట్ వసూళ్లు రావడం ఆగిపోయాయి. దీంతో దాదాపుగా హిందీ లో క్లోజింగ్ పడినట్టే. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఫుల్ రన్ లో దాదాపుగా 45 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరాలంటే కచ్చితంగా హిందీ వెర్షన్ నుండి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. కానీ అది జరగలేదు, దీంతో హిందీ లో కూడా నష్టాలు తప్పలేదు.
అయితే ఈ సినిమాకి నార్త్ అమెరికా లో వచ్చిన గ్రాస్ వసూళ్లను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతంలో ఈ చిత్రానికి దాదాపుగా రెండు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. వచ్చిన డిజాస్టర్ రేటింగ్స్ కి హిందీ ఆడియన్స్ నుండి ఆ మాత్రం గ్రాస్ వసూళ్లు రావడం చిన్న విషయమేమి కాదు. ఒక్కసారి ఊహించుకోండి, ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉండుంటే హిందీ వెర్షన్ నుండి ఏ రేంజ్ వసూళ్లు వచ్చేవో. ఫ్లాప్ అయినప్పటికీ ‘గేమ్ చేంజర్’ ద్వారా మన అందరికీ తెలిసింది ఏమిటంటే నార్త్ ఇండియా లో రామ్ చరణ్ కి ప్రభాస్, అల్లు అర్జున్ తో సమానంగా నిజమైన క్రేజ్ ఉంది అనే విషయం. ఈ సినిమా పోతే పోయింది. బుచ్చి బాబు సినిమా వర్కౌట్ అయితే రామ్ చరణ్ వండర్స్ క్రియేట్ చేస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.