Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వాలను మార్చేంత ఫాలోయింగ్ అతని సొంతం. అందుకే నేడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నాడు. అయితే చాలా మంది చెప్పేది ఏమిటంటే పవన్ కళ్యాణ్ కి తెలుగోళ్లు ఉన్న చోట మాత్రమే క్రేజ్ ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఆయనంటే ఎవరో తెలియదు అని అంటుంటారు. కారణం పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియన్ సినిమాలు చేయకపోవడమే, అంతే కాకుండా ఎక్కువ శాతం రీమేక్ సినిమాలు చేయడం వల్ల, ఆయన తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితమయ్యాడు అని అంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది అనేది వాస్తవం. ఈ సార్వత్రిక ఎన్నికలలో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. కానీ ఈ ఎన్నికల ముందే ఆయనకు ఇతర దేశాల్లో మంచి క్రేజ్ ఉంది.
అందుకు ఉదాహరణగా నేడు ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆఫ్రికా దేశం లోని బస్సు గ్లాస్ పై పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పోస్టర్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆఫ్రికా లో మన ఇండియన్స్ ఉండేది చాలా తక్కువ. అక్కడ కొన్ని అరుదైన ప్రాంతాలకు టూర్ కి వచ్చే వాళ్ళు తప్ప, ఆఫ్రికా దేశంలో స్థిరపడిన ఇండియన్స్ సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే ప్రపంచం లో అత్యంత పేద దేశం అది. అయితే ఒక ప్రముఖ ట్రావెల్లర్ కిలిమంజారో టూర్ ని కవర్ చేస్తూ ఒక వీడియో ని చేస్తుండగా, మధ్యలో అతనికి ఒక బస్సు కనిపించింది. ఆ బస్సు వెనుక భాగం గ్లాస్ పై ‘గబ్బర్ సింగ్’ మూవీ పోస్టర్ ని చూసి షాక్ కి గురయ్యాడు.
ఆఫ్రికా లో మన సినిమాలు విడుదల అవ్వడం అసాధ్యం, అలాంటిది పవన్ కళ్యాణ్ పోస్టర్ ఇక్కడికి ఎలా వచ్చింది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. మన సినిమాలు ఇప్పుడు అక్కడ విడుదల కాకపోయి ఉండొచ్చు. కానీ సోషల్ మీడియా ని ఇప్పుడు ప్రపంచం లో వాడని మనిషి ఎవరుంటారు చెప్పండి. యూట్యూబ్ లో మన సినిమాలను హిందీలోకి దబ్ చేసి విడుదల చేస్తే వందల కొద్దీ మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. హిందీ బాషాని ప్రపంచంలో దాదాపుగా అందరూ వాడుతుంటారు. అలా ఆఫ్రికన్ దేశం వాళ్ళు కూడా ఆ చిత్రాన్ని చూసి ఏమైనా కనెక్ట్ అయ్యి ఉంటారా అని సందేహపడుతున్నారు. ఏది ఏమైనా కానీ, పవన్ కళ్యాణ్ కి బౌండరీలు దాటి మంచి క్రేజ్ ఉంది. సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడితే ఆయన స్టామినా ని ఊహించడం ఎవరి తరం కాదంటూ సోషల్ మీడియా లో అభిమానులు అనుకుంటున్నారు.
#GabbarSingh beyond boundaries @PawanKalyan
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) January 31, 2025