Homeఎంటర్టైన్మెంట్Game Changer : అమెజాన్ ప్రైమ్ కి ఊహించని షాక్ ఇచ్చిన దిల్ రాజు..'గేమ్ చేంజర్'...

Game Changer : అమెజాన్ ప్రైమ్ కి ఊహించని షాక్ ఇచ్చిన దిల్ రాజు..’గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్ విడుదల అయ్యేది ఆ ఓటీటీ లోనే!

Game Changer :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం ఇటీవలే సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల మూడేళ్ళ నిరీక్షణకు తెరదించుతూ విడుదలైన చిత్రమిది. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు. మొదటి నుండి తక్కువ బడ్జెట్ లోనే సినిమాలను పూర్తి చేసే అలవాటు ఉన్న దిల్ రాజు, ఈ సినిమాకి డబ్బులు మంచి నీళ్లకు ఖర్చు చేసినట్టు చేసాడు. మొదటి రోజే 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తే, ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. థియేటర్స్ లో ఎలాగో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కనీసం ఓటీటీ లో అయినా బంపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందని అనుకున్నారు. బంపర్ రెస్పాన్స్ అయితే రాలేదు కానీ, పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ మాత్రం వచ్చింది.

Also Read : గేమ్ చేంజర్’ తో మోసపోయాం..దిల్ రాజు మాకు డబ్బులు ఎగ్గొట్టాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టిస్టులు!

అయితే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో హిందీ లో తప్ప అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. హిందీ థియేట్రికల్ రైట్స్ ఒప్పందం ప్రకారం, ఆరు వారాల తర్వాతనే ఓటీటీ లో విడుదల చేయాలి. ఈ సినిమాని నాలుగు వారాలకే తెలుగు,తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల చేయాల్సి వచ్చింది. హిందీ ఆడియన్స్ ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే హిందీ వెర్షన్ ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయట్లేదట. ఈ సినిమా హిందీ డిజిటల్ రైట్స్ ని జీ 5(Zee5) సంస్థకు దిల్ రాజు(Dil Raju) భారీ రేట్ కి అమ్మినట్టు తెలుస్తుంది. ఈ నెల 7వ తారీఖు నుండి ఈ సినిమా హిందీ వెర్షన్ జీ5 లో అందుబాటులోకి వస్తుందని కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు.

గత శనివారం ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని జీ5 యాప్ లో విడుదల చేయగా, సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కేవలం 12 గంటల్లోనే ఈ సినిమాకి దాదాపుగా 100 మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చాయట. #RRR కి మించిన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. జీ5 లో నార్త్ ఇండియన్స్ అత్యధికంగా ఉంటారు. రామ్ చరణ్ కి మొదటి నుండి బాలీవుడ్ వైపు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ప్రతీ సినిమాకి రికార్డు స్థాయి వ్యూస్ వస్తుంటాయి. మరి ‘గేమ్ చేంజర్; సినిమాకి కూడా బంపర్ రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే రామ్ చరణ్ ఈ చిత్రం తర్వాత బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ విరామం లేకుండా జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాదే విడుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

Also Reda : అమెజాన్ ప్రైమ్ లో ‘గేమ్ చేంజర్’ సెన్సేషనల్ రికార్డు..10 రోజుల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయో చూస్తే ఆశ్చర్యపోతారు!

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version