Bunny and Bhansali : అల్లు అర్జున్ కాదు కాదు పుష్ప అంటే అభిమానులు తెగ విజిల్స్ వేస్తారు. ఎవరికీ ఎక్కువగా సూట్ కానీ క్యారెక్టర్ పేర్లు అల్లు అర్జున్ కు సూట్ అవుతుంటాయి. సినిమా తర్వాత స్టోరీ గుర్తు ఉండటం కామన్. కానీ అందులోని పేరు చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. కానీ బన్నీ, ఆర్య అంటూ క్యారెక్టర్ పేర్లతో కూడా అభిమానులు పిలుచుకుంటారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచమే అల్లు అర్జున్ ను పుష్ప అని పిలుస్తుంది. ఇక పుష్ప సినిమా తర్వాత మరో సినిమా చేయాలంటే అల్లు అర్జున్ భయపడాల్సిందే.
మీరు విన్నది నిజమే. పుష్ప రేంజ్ సినిమాలు మరో సారి రావడం కష్టమే. ఈ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకోవడం కూడా కష్టమే. ఇక ఈయన నెక్ట్స్ సినిమా చాలా ఆచితూచి అడుగులు వేస్తే మాత్రమే మరో సినిమా ఈ రేంజ్ హిట్ ను సంపాదిస్తుంది. లేదంటే కచ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది. అందుకే తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో భయపడుతున్నారట పుష్ప రాజ్.
ఎందుకంటే ఈ స్టార్ హీరో ఇప్పుడు తెలుగు హీరో కాదు.. పాన్ ఇండియన్ హీరోగా మారిపోయారు. పుష్ప తర్వాత ఈయన రేంజ్ ఊహించుకోడానికి చాలా మందికి భయమే అని చెప్పాలి. బయటికి చెప్పట్లేదు కానీ ఈ భయం బన్నీని కూడా ఉంది అంటున్నారు కొందరు. ఎందుకంటే ఈ రేంజ్ స్టార్ డమ్ చూసాక.. నెక్ట్స్ చేయడానికి ఎలాంటి స్టోరీ ఉంటుంది? ఎలాంటి సినిమా తెరకెక్కించాలి అనే భయం కచ్చితంగా వేస్తుంది. ఇక ఏం చేసినా ఆడియన్స్‌కు అంత ఈజీగా నచ్చడం కూడా కష్టమే. అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా పడుడుతున్నాడు అల్లు అర్జున్.
అయితే ఏ చిన్న తప్పు కూడా జరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నాడు. త్వరలోనే త్రివిక్రమ్‌తో సినిమా మొదలు పెట్టబోతున్నాడట బన్నీ. మార్చి నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని టాక్. ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు కూడా. నాలుగు సంవత్సరాలుగా ఉన్న గడ్డం ఈ మధ్యే తీసేశారట. ఇప్పుడు కొత్త లుక్‌లోకి మారిపోయాడు అల్లు అర్జున్. ఇక రీసెంట్ గా ఈయన ముంబై వెళ్లారు. దాంతో అసలు చర్చ స్టార్ట్ అయింది. అక్కడ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని కలిసి ఆయన ఆఫీస్‌లో కాసేపు ఉన్నారు. కీలకమైన చర్చలు కూడా జరిగాయట. ఇక భన్సాలీ ఆఫీస్ నుంచి బన్నీ బయటికి వస్తున్న వీడియోలు వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 తర్వాత బాలీవుడ్‌లో బన్నీ పేరు మామూలుగా వినిపించడం లేదు. ఏకంగా పుష్ప పేరు మార్మోగిపోతుంది అనే చెప్పాలి. ఇప్పుడు భన్సాలీ మీటింగ్ చూసాక బన్నీ స్ట్రెయిట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేయబోతున్నారా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.