Shankar
Shankar : పాపం గత కొంతకాలంగా డైరెక్టర్ శంకర్(Shankar Shanmugham) నెత్తిన శనిదేవుడు తాండవిస్తున్నాడు. మూడు దశాబ్దాల నుండి ఎన్నో సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించి, ఇండియా లోనే నెంబర్ 1 డైరెక్టర్ గా చలామణి అయిన శంకర్ కి ‘2.O’ చిత్రం నుండి దరిద్రం పట్టుకుంది. ఈ సినిమా కమర్షియల్ గా ఎబోవ్ యావరేజ్ గా నిల్చింది కానీ, స్టోరీ పరంగా, కంటెంట్ పరంగా శంకర్ వీక్ వర్క్ అని అప్పట్లో వచ్చిన విమర్శలు మామూలివి కావు. శంకర్ లో జ్యూస్ అయిపోయింది, తదుపరి చిత్రానికి దొరికేస్తాడని అందరూ అప్పట్లో కామెంట్ చేసారు. అందరూ అనుకున్నట్టుగానే ఇండియన్ 2(Indian2 Movie) కి అడ్డంగా దొరికేసాడు. కనీసం ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) తో అయిన కం బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తే, ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ఇలా వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన శంకర్ కి ఇప్పుడు మరో షాక్ తగిలింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కాంబినేషన్ లో తెరకెక్కిన రోబో(Robo Movie) చిత్రం 2010 వ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదలై సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా స్టోరీ, నేను రాసిన ‘జిగూబా’ స్టోరీ కి కాపీ అని అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011 వ సంవత్సరం లో పిటీషన్ దాఖలు చేసాడు. డైరెక్టర్ శంకర్ కాపీ రైట్స్, ఐటీపీ చట్టాన్ని ఉల్లంఘించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు ని ఆ పిటీషన్ లో కోరాడు. ఈ కేసు పై శంకర్ కి వ్యతిరేకంగా ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) కూడా నివేదిక ఇచ్చింది. జిగూబ కథకు, డైరెక్టర్ శంకర్ తీసిన రోబో కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని తెలిపింది. ఈడీ కూడా ఈ అంశం పై విచారణ చేపట్టింది.
ఈ విచారణ లో శంకర్ లో సెక్షన్ 63 ని ఉల్లగించినట్టు స్పష్టం చేసింది. దీంతో శంకర్ కి సంబంధించి 10 కోట్ల రూపాయిల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఈ నెల 17న ఆస్తులను జప్తు చేసినట్టుగా ఇదే వెల్లడించింది. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ శంకర్ కి సపోర్టుగా ఆయన అభిమానులు ఈ చర్యని వ్యతిరేకిస్తుంటే, మరి కొంతమంది మాత్రం కాపీ చేసి సినిమా తీసావా అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రోబో చిరానికి గాను శంకర్ దాదాపుగా 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. అందులో పది కోట్ల రూపాయిలు ఇప్పుడు ఈడీ జప్తు చేసింది. అటు కెరీర్ పరంగా, ఇటు ఆర్థికంగా శంకర్ కి ఒకేసారి కష్టాలు రావడం గమనార్హం.