Game Changer: ఇండియా లో అద్భుతంగా డ్యాన్స్ వేసే టాప్ 3 హీరోల లిస్ట్ తీస్తే అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరుత సినిమాతోనే ఈయన డ్యాన్స్ విషయం లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఈమధ్య కాలం లో డ్యాన్స్ అంటే సర్కస్ ఫీట్స్ లాగా మారిపోయింది. డ్యాన్స్ వెయ్యండి రా బాబు అంటే, సర్కస్ ఫీట్లు చేసి అదే డ్యాన్స్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ రామ్ చరణ్ లాంటోళ్లను చూసినప్పుడే, ఇది కదా నిజమైన డ్యాన్స్ అని అనిపిస్తూ ఉంటుంది. ఈమధ్య కాలం లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువ రావడం వల్ల మన హీరోలు డ్యాన్స్ వెయ్యడం బాగా తగ్గించేశారు. కేవలం రామ్ చరణ్ ఒక్కడే తన ప్రతీ సినిమాలోనూ అభిమానులను నిరాశపర్చకుండా మంచి డ్యాన్స్ స్టెప్స్ వేస్తున్నాడు.
ఇకపోతే నేడు ఆయన హీరో గా నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం లోని ‘డోప్’ అనే వీడియో సాంగ్ విడుదలైంది. థమన్ అందించిన సరికొత్త బీట్స్, శంకర్ గ్రాండియర్ విజువల్స్ తో పాటు, రామ్ చరణ్ అద్భుతమైన డ్యాన్స్ కారణంగా ఈ సాంగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు ఈ పాటలోని రామ్ చరణ్ స్టెప్స్ ని అప్లోడ్ చేస్తే తెగ వైరల్ చేస్తున్నారు. ఇది కదా రామ్ చరణ్ వింటేజ్ డ్యాన్స్ అంటే, ఆ గ్రేస్ ఏంటి, ఆ స్పీడ్ ఏంటి అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. సాంగ్ ని చూస్తున్నంతసేపు రామ్ చరణ్ డ్యాన్స్ చూపులు తిప్పుకోనివ్వకుండా చేసింది. అభిమానులు ఇన్ని రోజులు ఎలాంటి కంటెంట్ కోసం అయితే ‘గేమ్ చేంజర్’ నుండి ఎదురు చూస్తున్నారో, ఆ కంటెంట్ వచ్చేసింది. ఇక ఇక్కడి నుండి సినిమాకి హైప్ వేరే లెవెల్ కి రీచ్ అవ్వబోతుంది అని చెప్పొచ్చు.
ఈ పాటకి జానీ మాస్టర్ కోరియోగ్రఫీ అందించాడు. ఏ మాటకి ఆ మాట, రామ్ చరణ్ – జానీ మాస్టర్ కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్ అన్ని అద్భుతంగా ఉంటాయి. రచ్చ, నాయక్, ఎవడు ఇలా ఎన్నో సినిమాలకు జానీ మాస్టర్ అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్ రామ్ చరణ్ కోసం కంపోజ్ చేసాడు. ఒక్కమాటలో చెప్పాలంటే జానీ మాస్టర్ పాపులర్ అయ్యిందే రామ్ చరణ్ సాంగ్స్ వల్ల అని చెప్పొచ్చు. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఈ సాంగ్ కి ఇప్పుడు సోషల్ మీడియా లో కేవలం రామ్ చరణ్ అభిమానుల నుండి మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది కేవలం టీజర్ లాంటిది మాత్రమే అని, థియేటర్ లో ఈ పాటని చూస్తే మెంటలెక్కిపోతారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.