Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక పాన్ ఇండియాలో తనను మించిన నటుడు మరొకరు లేరనేంతలా గుర్తింపు పొందడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పటివరకు 1400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ విషయం మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ మీద ఫైరయ్యాడు. ఎందుకు అంటే ఆయన చేసిన పనికి అందరూ నన్ను బ్లెమ్ చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడంతో హుటాహుటిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అయితే పెట్టాడు.
ఇక రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు గొడవ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారిందని చాలామంది చెబుతున్నారు. మరి మొత్తానికైతే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో చాలా కరెక్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే అతన్ని జైల్లో పెట్టే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక పోలీసులు కూడా అల్లు అర్జున్ కేసు కు సంబంధించి పకడ్బందీ ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు…ఇక ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్న అల్లు అర్జున్ అది ముగిసిన తర్వాత అల్లు అర్జున్ గారిదే తప్పు అని నిరూపించే ప్రయత్నంలో పోలీస్ శాఖ అయితే ముందుకు అడుగులు వేస్తుంది.
మరి అల్లు అర్జున్ నిజంగానే తప్పు చేశాడు అని తేలితే మాత్రం అతనికి జైలు శిక్ష పడే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి సందర్భంలో సీఎం చాలా స్ట్రాంగ్ గా నిలబడి జనాలకు గవర్నమెంట్ తరపున సమాన న్యాయం దక్కుతుంది అనే ఒక భరోసా ఇవ్వడానికే ఆయన ఈ కేసు మీద చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది…