Game Changer Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై అభిమానులను నిరాశపర్చిన సంగతి తెలిసిందే. కానీ మొదటి రోజు ఈ చిత్రానికి టాక్ తో సంబంధం లేకుండా 186 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. నిర్మాతలు హద్దు మీరు ఫేక్ చేస్తున్నారని, ఎదో పది కోట్లు, 20 కోట్లు ఎక్కువగా చూపిస్తూ పోస్టర్స్ వేయడం ఇది వరకు మనం చూసాము కానీ, ఇలా ఏకంగా వంద కోట్ల రూపాయిలు అదనంగా వేస్తూ పోస్టర్స్ వేయడం ఈ చిత్రానికే చూస్తున్నాం అంటూ ట్విట్టర్ లో నిన్న ట్రేడ్ విశ్లేషకులు సైతం మండిపడుతూ ట్వీట్లు వేశారు. అయితే మొదటి రోజు వాస్తవానికి వచ్చిన ఒరిజినల్ వసూళ్లు 100 కోట్ల రూపాయిల రేంజ్ లో ఉంది.
ఇదంతా పక్కన పెడితే రెండవ రోజు భారీ డ్రాప్స్ ఉంటాయని అందరూ అనుకున్నారు. నెగటివ్ టాక్ బయట వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. ఎవరినైనా ‘గేమ్ చేంజర్’ ని చూసావా అని అడిగితే, సినిమా బాగాలేదు అంతగా అనేస్తున్నారు. ఆ రేంజ్ నెగటివ్ టాక్ వెళ్ళిపోయింది. కానీ అంత నెగటివ్ టాక్ లో కూడా ఈ చిత్రానికి రెండవ రోజు డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 16 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వచ్చిన నెగటివ్ టాక్ కి ఇంత వసూళ్లు రావడం అనేది మామూలు విషయం కాదు. కానీ తెలుగు లో కంటే ఈ చిత్రానికి హిందీ లో ఎక్కువ వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. హిందీ లో ఈ చిత్రానికి రెండవ రోజు 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
మొత్తం మీద హిందీ లో రెండు రోజులకు కలిపి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మూడవ రోజు రెండవ రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అసలు ఈ హిందీ కలెక్షన్స్ నిజమా కాదా అని కొంతమంది అనిపించి ఉండొచ్చు. కానీ ఒక్కసారి యూట్యూబ్ లో గేమ్ చేంజర్ హిందీ వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ కి ప్రతీరోజు వస్తున్న వ్యూస్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. విడుదల తర్వాత ఈ ట్రైలర్ కి రోజుకి 1 మిలియన్ కి పైగా వస్తున్నాయి. అంటే ఈ చిత్రం కోసం గూగుల్ లో, యూట్యూబ్ లో బాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా వెతుకుతున్నారు అన్నమాట. చాలా మంది ఇది కార్పొరేట్ బుకింగ్స్ అని నిందలు వేస్తున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.