https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..తెలుగు లో భారీ డ్రాప్స్..కానీ హిందీలో మొదటిరోజు వసూళ్లను మించిన 3వ రోజు వసూళ్లు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి రోజు నుండే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 13, 2025 / 10:37 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి రోజు నుండే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ అద్భుతంగా నటించినప్పటికీ, డైరెక్టర్ శంకర్ సరైన టేకింగ్ లేకపోవడం వల్ల అభిమానులు ఈ చిత్రాన్ని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోయారు. సెకండ్ హాఫ్ లో కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉన్నటువంటి ఆపన్న క్యారక్టర్ ని మరో 20 నిమిషాలు పొడిగించి ఉండుంటే ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో రంగస్థలం అయ్యేది అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. అయితే ఫ్లాప్ టాక్ వచినప్పయికీ, ప్రీ ఫెస్టివల్ సీజన్ అయినా కూడా రామ్ చరణ్ స్టామినా కారణంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

    తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. ఏ ఇద్దరూ ఈ చిత్రం గురించి మాట్లాడుకున్నా ‘సినిమా బాగాలేదంటగా’ అని అనుకుంటున్నారు. ఆ నెగటివ్ టాక్ ప్రభావం ఈ చిత్రం మీద చాలా బలంగానే పడింది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం రెండవ రోజుతో పోలిస్తే మూడవ రోజు ఈ చిత్రానికి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. రెండవ రోజు రిటర్న్ జీఎస్టీ తో కలిపి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబడితే, మూడవ రోజు కేవలం 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈరోజు మ్యాట్నీ షోస్ నుండి ఈ చిత్రం మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి బిజినెస్ 130 కోట్ల రూపాయిల వరకు జరిగింది. ఇదే రేంజ్ ట్రెండ్ ని కొనసాగిస్తే మాత్రం ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయిల షేర్ రావడం కూడా కష్టమే.

    తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే హిందీ లో మాత్రం కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రోజు హిందీలో 8 కోట్ల 73 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబడితే, రెండవ రోజు 8 కోట్ల 43 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. మూడవరోజు అయితే ఏకంగా 10 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు రాగా, మూడు రోజులకు కలిపి హిందీ లో 28 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నార్త్ అమెరికా లో ఇప్పటికే 2 మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మరో 5 లక్షల డాలర్స్ ని మించి గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.