Gaddar film awards : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ‘గద్దర్ అవార్డ్స్'(Gaddar Awards) ని 2024 వ సంవత్సరం కి గానూ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేత థామస్ (35 చిన్న కథ కాదు), ఉత్తమ సహనటుడిగా ఎస్ జె సూర్య(సరిపోదా శనివారం), ఉత్తమ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ (కల్కి 2898 AD) లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. నేడు 2014 వ సంవత్సరం నుండి 2023 వరకు విడుదలైన సినిమాలకు గానూ ‘గద్దర్ అవార్డ్స్’ ని ప్రకటించారు. ఒక్కసారి ఆ సినిమాలేంటో చూద్దాము.
రన్ రాజా రన్ (2014):
శర్వానంద్(Sharwanand), అడవి శేష్(Adivi Sesh) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓజీ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సుజిత్ కి దర్శకుడిగా ఇది మొదటి చిత్రం. శర్వానంద్ కెరీర్ లో మొట్టమొదటి హిట్ చిత్రం కూడా ఇదే. ఈ చిత్రాన్ని ‘ఉత్తమ చిత్రం’ క్యాటగిరీలో గద్దర్ అవార్డ్స్ కి ఎంపిక చేసారు.
రుద్రమదేవి (2015):
అనుష్క(Anushka Shetty) ప్రధాన పాత్రలో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) స్పెషల్ రోల్ లో నటించిన ‘రుద్రమదేవి’ చిత్రాన్ని కూడా 2015 వ సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రం గా గద్దర్ అవార్డ్స్ కి ఎంపిక చేశారు. గుణ శేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆరోజుల్లో కూడా ఈ చిత్రానికి ఎన్నో పురస్కారాలు దక్కాయి. ఇప్పుడు ‘గద్దర్ అవార్డ్స్’ రూపం లో మరో అత్యున్నత పురస్కారం దక్కడం విశేషం.
శతమానం భవతి (2016) :
2016 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘శతమానం భవతి’ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’, మరో పక్క బాలయ్య బాబు ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రాలు అదే సంక్రాంతికి విడుదలై దుమ్ములేపే వసూళ్లను రాబడుతున్నప్పటికీ కూడా చిన్న సినిమాగా విడుదలై సెన్సేషన్ సృష్టించింది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా ఉత్తమ చిత్రంగా గద్దర్ అవార్డ్స్ కి ఎంపికైంది.
బాహుబలి 2 (2017):
మన తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రమిది. నేడు సౌత్ మొత్తం ఇలా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని శాసించే రేంజ్ కి ఎదిగామంటే అందుకు పునాది వేసింది ‘బాహుబలి 2’ చిత్రమే. ప్రభాస్(Rebel Star Prabhas), రానా దగ్గుబాటి(Rana Daggubati), అనుష్క(Anushka Shetty) ఇలా ప్రతీ ఒక్కరు ఈ చిత్రంలో పోటీపడి నటించారు. రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వం, కీరవాణి(MM Keeravani|) సంగీతం ఈ చిత్రం రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. అలా మన తెలుగు సినిమా సత్తా చాటిన ఈ చిత్రాన్ని ‘గద్దర్ అవార్డ్స్’ కి ఉత్తమ చిత్రం క్యాటగిరీలో ఎంపిక చేసారు.
మహానటి (2018):
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా పేరొందిన సావిత్రి బయోపిక్ గా నాగ్ అశ్విన్ ‘మహానటి’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కీర్తి సురేష్ ఇందులో సావిత్రి క్యారక్టర్ ఎంత అద్భుతంగా చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమె నటనకు గానూ ఉత్తమ నటి క్యాటగిరీ లో నేషనల్ అవార్డు ని కూడా అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కలెక్షన్ల కనకవర్షం కురిపించిన చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా గద్దర్ అవార్డ్స్ కి ఎంచుకున్నారు.
మహర్షి (2019):
సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఆరోజుల్లో కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. అద్భుతమైన అర్థవంతమైన సినిమా తీసినందుకు అప్పట్లో మహేష్ బాబు అందరూ మెచ్చుకున్నారు కూడా. అలా అప్పట్లోనే అవార్డ్స్, రివార్డ్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని కూడా ఉత్తమ చిత్రం క్యాటగిరీ లో ‘గద్దర్ అవార్డ్స్’ కి ఎంపిక చేసారు.
అలా వైకుంఠపురంలో (2020):
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రమిది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. పాటల పరంగా, కథ పరంగా ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. అలాంటి ఈ చిత్రం కూడా ‘గద్దర్ అవార్డ్స్’ కి ఎంపిక కావడం పై అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#RRR (2021):
తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రమిది. ఆస్కార్ అవార్డుని కనీసం దగ్గర నుండైనా చూడగలమా అని అనుకునేవాళ్లం ఒకప్పుడు. అలాంటిది ఈ చిత్రం ఏకంగా ఆస్కార్ అవార్డు ని సొంతం చేసుకుందంటే ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్,ఎన్టీఆర్, రాజమౌళి సృష్టించిన ప్రకంపనలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ చిత్రాన్ని కూడా గద్దర్ అవార్డ్స్ కి ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం చేత కూడా గౌరవం దక్కేలా చేశారు.
సీతారామం (2022)
మలయాళం హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోహీరోయిన్లు గా హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ‘సీతారామం’ చిత్రం 2022 వ సంవత్సరం లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ని సృష్టించింది. అంతే కాకుండా టాలీవుడ్ ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచిపోయింది ఈ చిత్రం. అలాంటి సినిమాని ఉత్తమ చిత్రం క్యాటగిరీ లో ఎంచుకోవడం సరైన నిర్ణయం అని చెప్పొచ్చు.
బలగం (2023):
తెలంగాణ పల్లెల సంస్కృతి కి అద్దం పట్టేలా డైరెక్టర్ వేణు తెరకెక్కించిన ఈ ‘బలగం’ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించింది. ఈ చిత్రం లో హీరో హీరోయిన్లు గా ప్రియదర్శి , కావ్య కళ్యాణ్ రామ్ లు నటించారు. పలు అంతర్జాతీయ అవార్డ్స్ కి కూడా ఎంపికైన ఈ చిత్రాన్ని ఉత్తమ చిత్రం క్యాటగిరీ లో ఎంచుకోవడం సరైన నిర్ణయమని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొనియాడుతున్నారు.
