https://oktelugu.com/

Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సినిమాల పేర్లు వేరు కానీ క్యారెక్టర్లు ఒక్కటేనా..?

ఇప్పుడు అదే రీతిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో కూడా మరోసారి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి ఒక భారీ సక్సెస్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : May 17, 2024 4:42 pm
    Gabbar Singh and Ustad Bhagat Singh, the names of these two movies

    Gabbar Singh and Ustad Bhagat Singh, the names of these two movies

    Follow us on

    Ustad Bhagat Singh: హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి డైలాగు కూడా భారీ గా పేలడమే కాకుండా ఈ సినిమా సక్సెస్ లో ఆయన చెప్పిన డైలాగులు కీలకపాత్ర వహించాయనే చెప్పాలి.ఇక హరీష్ శంకర్ సినిమా అంటే అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ బీభత్సంగా ఉంటాయి. కాబట్టి ఈ సినిమాలో కూడా వాటికి కొదవ లేకుండా పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ కొంచెం కూడా తగ్గించకుండా చాలా బాగా చూపించి పవన్ కళ్యాణ్ కి ఒక భారీ సక్సెస్ ను అయితే ఇచ్చాడు.

    ఇక ఇప్పుడు అదే రీతిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో కూడా మరోసారి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి ఒక భారీ సక్సెస్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గబ్బర్ సింగ్ సినిమాలో మాదిరిగానే ఉంటుందా లేదంటే కొంచెం కొత్తగా ఉంటుందా అనే డౌట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదిక చాలామందికి కలుగుతున్నాయి.

    గబ్బర్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఇక ఇందులో కూడా పోలీసు గానే కనిపిస్తున్నాడు. అయితే గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి కొ’ంచెం తిక్కుంటుంది కానీ దానికో లెక్కుంటుంది’ అనే డైలాగ్ తోనే ఆయన క్యారెక్టరైజేశన్ ఎలా ఉండబోతుందో ఎస్టాబ్లిష్ చేశాడు. మరి ఈ సినిమాలో కూడా అలాంటి ఒక డైలాగ్ తో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాడా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

    ఇక కొందరైతే ఉస్తాద్ టిజర్ లో చూస్తే గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి కొనసాగింపు గానే ఈ సినిమాలో ఆయన పాత్ర ఉండబోతుందంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ మీదనే ఈ సినిమా సక్సెస్ అనేది చాలా వరకు ఆధారపడి ఉంటుందనేది వాస్తవం…