Gaanja Shankar First High: తెలుగు సినిమా ఇండస్ట్రీకి మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ వరుస విజయాలను అందుకుంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఈయన చేసిన మొదటి సినిమా అయిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమా నుంచి మొన్న వచ్చిన విరూపాక్ష వరకు కూడా ఈయన ప్రతి సినిమా అందరిని అలరిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి.
ఇక ఈయన ప్రస్తుతం విరూపాక్ష సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నారు. దీంతో పాటు గా ఆయన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో సినిమా ఆశించిన విజయాన్ని అందించనప్పటికీ విరూపాక్ష మాత్రం తనకి ఒక పవర్ ప్యాక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక విరూపాక్ష ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ హై ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అయితే అది ఎలా ఉంది,సాయిధరమ్ తేజ్ ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అనేది మనం ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా వీళ్ల కాంబో లో వస్తున్న సినిమా కి గాంజా శంకర్ అనే పేరును పెట్టారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ హై ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది.ఇక ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మరో కొత్త లుక్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఫస్ట్ హై ని సంపత్ నంది ఓపెన్ చేస్తూ ఒక చిన్న పిల్లకి సూపర్ మాన్ స్టోరీస్ చెప్తూ ఉంటే ఆ పాప సూపర్ మాన్, స్పైడర్ మాన్ వద్దు నాన్న నాకు లోకల్ లో ఉండే ఒక లోకల్ మేన్ కథ చెప్పు అని అనగా వాయిస్ ఓవర్ లో గాంజా శంకర్ ఇంట్రడక్షన్ అనేది జరుగుతుంది. అనిమేటెడ్ గా చూపిస్తూ వాయిస్ ఓవర్ తో ఫస్ట్ హై ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా చూస్తుంటే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది.
సాయి ధరమ్ తేజ్ తెలంగాణ స్లాంగ్ లో ఒక డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సాయిధరమ్ తేజ్ కూడా ప్రస్తుతం తెలంగాణ స్లాంగ్ లో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఫస్ట్ హై బాగున్నప్పటికీ గాంజా శంకర్ కొంచెం ఇస్మార్ట్ శంకర్ సినిమా లా ఉంటుందేమో అనే ఫీల్ అయితే కలుగుతుంది. ఎందుకంటే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ మధ్య కాలం లో వచ్చిన ఫుల్ మాస్ సినిమా ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి. దానికి తోడుగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతం గా ఆకట్టుకుంది.అయితే ఈ గాంజా శంకర్ ఒక అవారాగా తిరుగుతున్న వ్యక్తికి సంబంధించిన స్టోరీ అనేది మనకు ఫస్ట్ హై లోనే ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా కూడా ఇస్మార్ట్ శంకర్ మాదిరిగానే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది కాబట్టి ఆ రేంజ్ లో హిట్ అవుతుందో లేదో రిలీజ్ అయ్యేంతవరకు ఆగాలి ఏదేమైనా ఈ మాస్ లుక్ లో వచ్చిన గాంజా శంకర్ ఫస్ట్ హై మాత్రం అద్భుతంగా ఉందనే చెప్పాలి…