Gaalodu Collections: జబర్దస్త్ షో ద్వారా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని అందించి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గాలోడు’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై యావరేజి రెస్పాన్స్ ని దక్కించుకుంది..టాక్ యావరేజి గా వచ్చినప్పటికీ కూడా సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయి..ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో ఈమధ్య విడుదలైన చాలా సినిమాలకంటే మంచి ఓపెనింగ్ ని దక్కించుకుంది ఈ సినిమా..విడుదలైన అన్ని ప్రాంతాలలో ఉత్తరాంధ్ర నుండి ఈ సినిమాకి భారీ ఓపెనింగ్ రావడం విశేషం.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు కలిపి 2 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది..టీజర్ , ట్రైలర్ ఏది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు..సాంగ్స్ కూడా పెద్దగా పాపులర్ అవ్వలేదు..ఇన్ని ప్రతికూల వైబ్రేషన్స్ తో విడుదలైన ఈ సినిమాకి కేవలం సుధీర్ పేరు మీద ఓపెనింగ్ వచ్చింది..ఒకవేళ సుధీర్ మంచి క్వాలిటీ మూవీ తో వస్తే కచ్చితంగా అతనికి హీరోగా మంచి భవిష్యత్తు ఉంటుందనే చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాకి ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లు ని విశ్లేషిస్తే ముందుగా మనం ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి..ఈ ప్రాంతం లో ఈ సినిమాకి మొదటి రోజు 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..సీడెడ్ లో కూడా ఈ సినిమాకి ఊహించని రేంజ్ లోనే ఓపెనింగ్స్ వచ్చాయి..అక్కడ ఈ చిత్రానికి దాదాపుగా 18 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..మదనపల్లి వంటి చోట్ల ఈ చిత్రానికి నిన్న నాలుగు ఆటలు హౌస్ ఫుల్స్ పడడం విశేషం..మొత్తం మీద ఆంధ్ర మరియు సీడెడ్ కలిపి 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో 40 లక్షల రూపాయిలు గ్రాస్ వచ్చింది.

ఓవర్సీస్ లో విడుదలైనప్పటి అక్కడి కలెక్షన్స్ నామ మాత్రమే అని చెప్పొచ్చు..వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా మొదటి రోజున కోటి పది లక్షల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి..సహాయ 50 లక్షల రేంజ్ లో ఉండొచ్చు..ఇక రెండవ రోజు కూడా డీసెంట్ స్థాయి ట్రెండ్ ని చూపించిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.