Bigg Boss 6- Eliminated Contestants Remuneration: బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ ఎలిమినేషన్స్ అన్ని అన్యాయంగానే జరుగుతున్నాయని ప్రేక్షకుల నుండి బలంగా వినిపిస్తున్న మాట..బాగా ఆడే కంటెస్టెంట్స్ అందరిని పంపిస్తున్నారని..వీక్ కంటెస్టెంట్స్ ని మాత్రం హౌస్ లో పెట్టి మేపుతున్నారని..అసలు ఈ సీజన్ బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్ అని సోషల్ మీడియా లో ట్రోలింగ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి..అగ్రెసివ్ గా ఆడుతున్న సమయం లో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్, ఆ తర్వాత టాస్కుల పరంగా మరియు ఎంటర్టైన్మెంట్ పరంగా మంచి కంటెంట్ ని ఇచ్చే సూర్య ఎలిమినేషన్..ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నత్తనడకన సాగుతున్న సమయం లో అద్భుతమైన కంటెంట్ ని ఇచ్చి ఆట ని రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేసే గీతూ ఎలిమినేషన్..గత వారం లో డబుల్ ఎలిమినేషన్ ద్వారా మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ బాలాదిత్య ని కూడా బయటకి పంపేయడం వంటివి ఈ షో కి తీవ్రమైన నెగటివిటీ వచ్చేలా చేసింది.

గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ కూడా బాగా ఇచ్చేవారు..కానీ ఈసారి పాల్గొన్న కంటెస్టెంట్స్ కి రెమ్యూనరేషన్ విషయం లో బిగ్ బాస్ నిర్వాహకులు మొండిచెయ్యి చూపిస్తున్నట్టు సమాచారం..గీతూ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి 9 వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను ఆమెకి కేవలం రెండున్నర లక్షల రూపాయిలు మాత్రమే ఇచ్చారట..గత సీజన్ లో కంటెస్టెంట్స్ కి పెద్దగా పాపులారిటీ లేకపోయినా వాళ్లకి కూడా మినిమం లోకి మినిమం పది లక్షల రూపాయిల వరుకు ఇచ్చేవారు.

కానీ ఈసారి బాలాదిత్య వంటి పాపులర్ సెలబ్రిటీ కి కూడా కేవలం 6 లక్షల తోనే సరిపెట్టి పంపారు..ఇక కాష్ ప్రైజ్ అయినా 50 లక్షలు ఇస్తున్నారా అంటే అది లేదు..ఆ కాష్ ప్రైజ్ ని కూడా టాస్కులో పెట్టి 50 లక్షలను కాస్త 38 లక్షలు చేసారు..రాబొయ్యే రోజుల్లో ఈ ప్రైజ్ మరింత తగ్గిపోయి చివరికి ప్రైజ్ మని 10 లక్షల రూపాయలకు స్థిర పడుతుందని టాక్ వినిపిస్తుంది..ఈ సీజన్ అనుకున్న స్థాయిలో నిర్వాహకులకు లాభాలు రప్పించలేకపోయినందునే ఇలా చేస్తున్నారని తెలుస్తుంది.