Aamir Khan Daughter Engagement: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. విభిన్న పాత్రలు పోషించే అమీర్ ఖాన్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల ఆయన నటనకు విరామం చెప్పి.. ఇక నిర్మాతగా కొనసాగుతానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ చాలా మందికి పరిచయం అయింది. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు పెట్టి ఇప్పటికే విశేష అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఈమె తన ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో నిశ్చితార్థం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి.

ఏదైనా నిర్మోహమాటంగా చెప్పే అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ నెటిజన్లకు సుపరిచితమే. అయితే ఐరా ఖాన్ గతంలో మిషాల్ తో ప్రేమాయణం సాగించింది. ఆ తరువాత మిషాల్ తో బ్రేకప్ చెప్పింది. కరోనా సమయంలో ఐరా ఖాన్ కు నుపుర్ శిఖర్ ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్నారు. ఈ క్రమంలో అతనితో ప్రేమలో పడింది. ఓ సారి సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు నుపుర్ శిఖర్ విదేశాలకు వెళ్లాడు. ఈ సమయంలో ఐరా ఖాన్ అతనితో పాటు వెళ్లింది.
అక్కడ పోటీలు అయిపోయాక.. నుపుర్ ఐరా ఖాన్ వద్దకు వెళ్లి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా..?’ అని అడిగాడట. వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ముంబయ్ లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకలను అమీర్ ఖాన్ మాజీ భార్య బంధువులంతా హాజరయ్యారు. ఇందులో భాగంగా ఐరా ఖాన్ వేలికి నుపుర్ ఉంగరం తొడిగాడు.. ఆ తరువాత ముద్దు పెట్టాడు. ఈ విషయాన్ని ఐరా ఖాన్ సోషల్ మీడియాలో వెల్లడించింది.

మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందిన నుపుర్ శిఖర్ సినీ సెలబ్రెటీల అందరికీ ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. 2004లో పూణె నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఆయన సుస్మితా సేన్ కు వ్యక్తిగత శిక్షణ ఇచ్చారు. అక్కడి నుంచి అతడి జీవితం కీలక మలుపు తిరిగింది. ఆ తరువాత అమీర్ ఖాన్, కిరణ్ రావుతో పాటు సెలబ్రెటీలకు ట్రైనర్ గా పనిచేశాడు. ఇప్పుడు ఐరా ఖాన్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. కానీ ఆమెతో జీవితాన్ని పంచుకోనున్నాడు.