Chikiri Song: స్టార్ హీరో సినిమాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే ఆరోజు సోషల్ మీడియా మొత్తం ఫన్నీ ట్రోల్స్ తో నిండిపోతాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తే, మూవీ లవర్స్ ట్విట్టర్ కి వచ్చి కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. మంచి టైం పాస్ ఎంటర్టైన్మెంట్ దొరుకుంటుంది. నేడు రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) మూవీ నుండి ‘చికిరి’ సాంగ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయం లో ట్రోల్స్ కూడా గట్టిగానే వచ్చాయి. ముఖ్యమా ప్రోమో రామ్ చరణ్ వేసే హుక్ స్టెప్ ని ఒక పక్క అభిమానులు ఎంజాయ్ చేస్తుంటే, మరోపక్క యాంటీ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ట్రోల్స్ వేస్తున్నారు.
oreyyypic.twitter.com/lwvrq1KXdO
— Kapil (@theyhatekapil) November 5, 2025
వివిధ రకాలుగా ఎడిటింగ్స్ చేసి ట్విట్టర్ మొత్తం తిప్పుతున్నారు. అందులోని కొన్ని ట్వీట్స్ మీ కోసం క్రింద అందిస్తున్నాము చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే పూర్తి పాటని ఈ నెల 7వ తారీఖున విడుదల చేయబోతున్నారట. చాలా కాలం తర్వాత AR రెహమాన్ మన టాలీవుడ్ కి వచ్చి చేస్తున్న చిత్రం కావడం తో ఈ మూవీ ఆల్బమ్ పై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. కానీ నేటి ప్రోమో సాంగ్ ట్యూన్ యావరేజ్ రేంజ్ లో ఉంది. పూర్తి సాంగ్ కూడా ఇలాగే ఉంటే ఆల్బమ్ పై ఆడియన్స్ లో మంచి అభిప్రాయం కలిగే అవకాశాలు తక్కువ ఉండొచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతోంది. గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ తో డీలాపడిన చరణ్ ఫ్యాన్స్ ని ఈ చిత్రం ఏ మేరకు సంతృప్తి పరుస్తుందో చూడాలి.
My Phone rang while I was in the Toilet, but it was my Favorite Ringtone
— JS (@TheRedDragonn_) November 5, 2025
— HarshaVardhan (@Harsha2_) November 5, 2025